దుర్గ పూజలో ముస్లిం యువకులు

దుర్గ పూజలో ముస్లిం యువకులు

సిల్చార్: భిన్నత్వంలో ఏకత్వంగా మన దేశం గురించి గొప్పగా చెప్పుకుంటాం. అందుకు తగ్గట్లే మతాలతో సంబంధం లేకుండా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, పార్సీలు అందరూ కలసిమెలసి ఉంటారు. అంతేకాదు, ఒకరికి పండుగలను ఇంకొకరు  జరుపుకోవడాన్ని చూస్తుంటాం. తాజాగా దీనికి ఉదాహరణగా నిలుస్తూ.. అస్సాంలో ముస్లిం యువకులు దుర్గా పూజను ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సిల్చార్, కాచర్‌లోని ఓ ఆలయంలో హిందువులతో కలసి ముస్లిం యువకులు పూజలో పాల్గొన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పూజ అనంతరం భక్తులకు ముస్లిం యువకులు పండ్లు పంచడాన్ని ఫొటోల్లో చూడొచ్చు. దీనిపై పూజలో పాల్గొన్న రజా లస్కర్ అనే యువకుడు మాట్లాడుతూ.. హిందూ, ముస్లింల ఐక్యత చెక్కుచెదరకుండా ఉందనే సందేశాన్ని ఇవ్వాలనుకున్నాం అన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

రావణుడి ఫొటో కాల్చొద్దంటూ నిరసన

‘మా నాన్నను ఇండియాకు రప్పించండి’

ఎర్ర కారం.. చాలా టేస్ట్​ గురూ..