జాయింట్ బార్డర్ కు… నార్త్​ కొరియా సైన్యం

జాయింట్ బార్డర్ కు… నార్త్​ కొరియా సైన్యం

ప్యాంగ్యాంగ్ : సౌత్ కొరియా, నార్త్ కొరియా ల మధ్య టెన్షన్​ కొనసాగుతోంది. తమ అధ్యక్షుని పై సౌత్ కొరియా బార్డర్ నుంచి తప్పుడు ప్రచారాలు చేస్తూ పాంప్లెట్లు వేసే వారిని అడ్డుకోవటం లేదని నార్త్ కొరియా ఆదేశంపై సీరియస్​గా ఉంది. ఈ కారణంగానే డీ మిలిటరైజ్డ్ జోన్ కు నార్త్ కొరియా సైన్యాన్ని పంపిస్తోంది. ఈ విషయాన్ని కిమ్ సిస్టర్ కిమ్ యో జోంగ్ వెల్లడించారు. రెండు దేశాల మధ్య కుదిరిన అగ్రిమెంట్​ ప్రకారం ఈ ప్రాంతంలో ఎలాంటి సైనిక కదలికలు ఉండకూడదు. సౌత్ కొరియా వైఖరి తో ఆ దేశం తో ఎలాంటి సంబంధాలు కొనసాగించవద్దని నార్త్ కొరియా భావిస్తోంది. దీంతో జాయింట్ బార్డర్ దగ్గరకు భారీగా సైన్యాన్ని పంపిస్తోంది. ఇప్పటికే రెండు దేశాల సరిహద్దుల్లో 2018 లో నిర్మించిన కామన్​ ఆఫీస్​ను కూడా నార్త్​ కొరియా ఆర్మీ పేల్చేసింది. ఈ చర్యతో రెండు దేశాల మధ్య టెన్షన్లు నెలకొంటున్నాయి. సమస్య ను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని సౌత్ కొరియా కోరినప్పటికీ నార్త్ కొరియా అంగీకరించటం లేదు.

South Korea