నార్త్ జోన్లో స్నాచింగ్, దోపిడీలు.. పక్షం రోజుల్లో జరిగిన కేసుల్లో నిందితులు అరెస్ట్

నార్త్ జోన్లో స్నాచింగ్, దోపిడీలు.. పక్షం రోజుల్లో జరిగిన కేసుల్లో నిందితులు అరెస్ట్

పద్మారావునగర్, వెలుగు: గత పక్షం రోజులుగా నార్త్​జోన్​పరిధిలో జరిగిన సెల్​ఫోన్‌, చైన్‌ స్నాచింగ్‌, దొంగతనాలు, దోపిడీ కేసులను ఛేదించినట్లు డీసీపీ రష్మీ పెరుమాళ్​శనివారం తన ఆఫీస్​లో వెల్లడించారు. మార్కెట్ పీఎస్​పరిధిలో అక్టోబర్‌ 7న జరిగిన సెల్​ఫోన్‌ స్నాచింగ్‌ కేసులో మాంచాల జనార్దన్‌, చెరక గౌతమ్‌ కుమార్​ను12 గంటల్లో అరెస్ట్‌ చేసి, రియల్​మీ మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

బేగంపేట పరిధిలో అక్టోబర్‌ 26న ఓ మహిళ మంగళసూత్రం స్నాచింగ్‌ చేసిన జొన్నలగడ్డ అశోక్‌, గంటెనపల్లి రమణయ్యను ఘటన జరిగిన కొన్ని నిమిషాల్లోనే పట్టుకున్నారు. మహాంకాళి పీఎస్​ పరిధిలో ఆటో డ్రైవర్​పై కత్తితో దాడి చేసి ఆటో, ఫోన్‌ లాక్కెళ్లిన సయ్యద్‌ జుబైర్‌ అలీ, మహ్మద్‌ పాషా అనే ఇద్దరిని గంటన్నరలో మోగల్‌పుర వద్ద అరెస్ట్ చేశారు. వీరి నుంచి 10 మొబైల్స్‌, రూ.9.5 వేల నగదు,కత్తి, ట్యాబ్‌, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. బోయిన్​పల్లి పరిధిలో అక్టోబర్‌ 8న ఓ ఇంట్లో చోరీ చేసిన జంగలం చందన్‌, లక్ష్మిని సీసీ ఫుటేజీ ఆధారంగా పట్టుకున్నారు. 

అక్టోబర్‌ 27న బోయిన్‌పల్లిలో ఓ మహిళ బ్యాగ్‌ మాయమైన ఘటనలో ఓ జువైనైల్‌ నిందితుడిని గుర్తించారు. మరో ఘటనలో నకిలీ పోలీస్​గా నటించి జరిమానా వసూలు చేసిన మసూద్‌ ఖాన్​ను అక్టోబర్‌ 28న అరెస్ట్‌ చేశారు. పాన్​బజార్​లో ఒకరి నుంచి మొబైల్‌ లాక్కెళ్లిన షేక్‌ జావీద్‌, షేక్‌ అరీఫ్​ను పట్టుకున్నారు.

భారీగా మొబైల్‌ ఫోన్ల రికవరీ

నార్త్​జోన్​లోని వివిధ పోలీస్​ స్టేషన్​లో పరిధిలో బాధితులు పొగొట్టుకున్న, చోరీకి గురైన 118 మొబైల్‌ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటిని బాధితులకు శనివారం డీసీపీ రష్మి పెరుమాళ్ అందజేశారు.