4 బంతుల్లో 4 వికెట్లు.. దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ పేసర్ అకీబ్ నబీ రికార్డు

4  బంతుల్లో 4 వికెట్లు.. దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ పేసర్ అకీబ్ నబీ రికార్డు

బెంగళూరు: దులీప్‌‌‌‌ ట్రోఫీ క్వార్టర్‌‌‌‌ఫైనల్లో ఈస్ట్‌‌‌‌ జోన్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌లో తడబడింది. నార్త్‌‌‌‌ జోన్‌‌‌‌ మీడియం పేసర్‌‌‌‌ అకీబ్‌‌‌‌ నబీ (5/28) హ్యాట్రిక్‌‌‌‌ సహా ఐదు వికెట్లతో పాటు అరుదైన రికార్డు నమోదు చేయడంతో.. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే టైమ్‌‌‌‌కు ఈస్ట్‌‌‌‌ జోన్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 56.1 ఓవర్లలో 230 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. దాంతో నార్త్‌‌‌‌ జోన్‌‌‌‌కు 175 రన్స్‌‌‌‌ లీడ్‌‌‌‌ లభించింది. విరాట్‌‌‌‌ సింగ్‌‌‌‌ (69) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. ఓపెనర్లలో ఉత్కర్ష్‌‌‌‌ సింగ్‌‌‌‌ (38) ఫర్వాలేదనిపించినా.. శరణ్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ (6), శ్రీదమ్‌‌‌‌ పాల్‌‌‌‌ (7) నిరాశపర్చారు. 

ఫలితంగా 66/3తో కష్టాల్లో పడిన ఈస్ట్‌‌‌‌ను విరాట్‌‌‌‌ సింగ్‌‌‌‌ ఆదుకున్నాడు. రియాన్‌‌‌‌ పరాగ్‌‌‌‌ (39)తో నాలుగో వికెట్‌‌‌‌కు 60, కుమార్‌‌‌‌ కుశాగ్ర (29)తో ఐదో వికెట్‌‌‌‌కు 74 రన్స్‌‌‌‌ జోడించాడు. ఇక 200/5తో నిలకడగా కనిపించిన ఈస్ట్‌‌‌‌ను నబీ దెబ్బకొట్టాడు. వరుసగా నాలుగు బాల్స్‌‌‌‌లో నలుగుర్ని ఔట్‌‌‌‌ చేశాడు. 53వ ఓవర్‌‌‌‌లో చివరి మూడు బాల్స్‌‌‌‌కు విరాట్‌‌‌‌ సింగ్‌‌‌‌, మానిషి (0), ముక్తార్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ (0)ను తన తర్వాతి ఓవర్‌‌‌‌ (55) తొలి బాల్‌‌‌‌కు సురజ్‌‌‌‌ సింధు జైస్వాల్‌‌‌‌ (10)ను ఔట్‌‌‌‌ చేశాడు.

దీంతో దులీప్‌‌‌‌ ట్రోఫీ చరిత్రలో ఈ ఫీట్‌‌‌‌ సాధించిన తొలి ఇండియన్‌‌‌‌గా, ఫస్ట్‌‌‌‌ క్లాస్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో నాలుగో ప్లేయర్‌‌‌‌గా నబీ రికార్డులకెక్కాడు. ఆ వెంటనే మరో ఓవర్‌‌‌‌లో మహ్మద్‌‌‌‌ షమీ (1)ని పెవిలియన్‌‌‌‌కు పంపాడు. దాంతో 30 రన్స్‌‌‌‌ తేడాతో చివరి ఐదు వికెట్లు పడ్డాయి. హర్షిత్‌‌‌‌ రాణా 2 వికెట్లు తీశాడు. అంతకుముందు 308/6 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన నార్త్‌‌‌‌ జోన్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 93.2 ఓవర్లలో 405 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది.