ఓస్లో: ఇండియా గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్‌కు.. నార్వే చెస్ టోర్నీలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) 42 ఎత్తుల వద్ద గుకేశ్‌కు చెక్ పెట్టాడు. తాజా ఓటమితో గుకేశ్ మూడున్నర పాయింట్లతో ఆఖరి స్థానానికి పడిపోయాడు. ఈ ఏడాది చివర్లో వరల్డ్ చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకోవాల్సిన ఇండియన్ ప్లేయర్ ఫామ్‌లేమి ఆందోళన కలిగిస్తోంది. మరో గేమ్‌లో ఆర్. ప్రజ్ఞానంద ఆర్మగెడాన్ టైబ్రేక్‌లో విన్సెట్ కీమర్ (జర్మనీ)పై గెలిచాడు. ఇద్దరి మధ్య జరిగిన క్లాసికల్ గేమ్ డ్రా కావడంతో టైబ్రేక్‌ను నిర్వహించారు.
ఇందులో ప్రజ్ఞానంద కేవలం 17 ఎత్తుల్లోనే నెగ్గాడు. ప్రస్తుతం ప్రజ్ఞా 6 పాయింట్లతో రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. అలీరెజా ఫిరౌజ (ఫ్రాన్స్) 8.5 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. విమెన్స్ కేటగిరీలో దివ్య దేశ్‌ముఖ్ (5.5).. అన్నా ముజిచుక్ (ఉక్రెయిన్, 5.5) చేతిలో, కోనేరు హంపి (3).. జు జినెర్ (చైనా, 5.5) చేతిలో ఓడారు. దివ్య ఐదో స్థానంలో ఉండగా, హంపి ఆఖరి ప్లేస్‌కు పరిమితమైంది.
