నార్వే చెస్‌‌ టోర్నీ.. కార్ల్‌‌‌‌సన్‌‌కు ప్రజ్ఞానంద చెక్‌‌

నార్వే చెస్‌‌ టోర్నీ.. కార్ల్‌‌‌‌సన్‌‌కు ప్రజ్ఞానంద చెక్‌‌

ఓస్లో: ఇండియా గ్రాండ్‌‌ మాస్టర్‌‌ ఆర్‌‌. ప్రజ్ఞానంద.. నార్వే చెస్‌‌ టోర్నీలో సంచలన విజయం నమోదు చేశాడు. బుధవారం రాత్రి జరిగిన మూడో రౌండ్‌‌ క్లాసికల్‌‌ గేమ్‌‌లో ప్రజ్ఞా 45 ఎత్తుల వద్ద వరల్డ్‌‌ నంబర్‌‌వన్‌‌ మాగ్నస్‌‌ కార్ల్‌‌సన్‌‌ (నార్వే)పై నెగ్గాడు. 2024లోనూ కార్ల్‌‌సన్‌‌ను ఓడించిన ఇండియన్‌‌ గ్రాండ్‌‌ మాస్టర్‌‌.. క్లాసికల్‌‌ ఫార్మాట్‌‌లో అతనిపై రెండో విజయాన్ని అందుకోవడం విశేషం.

తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద కీలక టైమ్‌‌లో వ్యూహాత్మకంగా ఎత్తులు వేసి పైచేయి సాధించాడు. ఈ విజయంతో ప్రజ్ఞానంద 4.5 పాయింట్లతో రెండో ప్లేస్‌‌లో నిలవగా, కార్ల్‌‌సన్‌‌ 1.5 పాయింట్లతో ఆఖరి స్థానంలో ఉన్నాడు. మరో గేమ్‌‌లో ఇండియా గ్రాండ్‌‌ మాస్టర్‌‌ డి. గుకేశ్‌‌.. అలీరెజా ఫిరౌజా (ఫ్రాన్స్‌‌) చేతిలో ఓటమిపాలయ్యాడు.

క్లాసికల్‌‌ గేమ్‌‌ డ్రా కావడంతో ఇద్దరి మధ్య నిర్వహించిన ఆర్మగెడాన్‌‌ టైబ్రేక్‌‌లో ఫిరౌజా విజయం సాధించాడు. ప్రస్తుతం గుకేశ్‌‌ మూడున్నర పాయింట్లతో నాలుగో ప్లేస్‌‌లో ఉండగా, ఫిరౌజా 7.5 పాయింట్లతో టాప్‌‌ ప్లేస్‌‌లో కొనసాగుతున్నాడు. విమెన్స్‌‌లో దివ్య దేశ్‌‌ముఖ్‌‌.. బిబిసారా అసౌబయోవా (కజకిస్తాన్‌‌)పై గెలవగా, తెలుగు గ్రాండ్‌‌ మాస్టర్‌‌ కోనేరు హంపి.. అన్నా ముజిచుక్‌‌ (ఉక్రెయిన్‌‌) చేతిలో ఓడింది. దివ్య నాలుగున్నర పాయింట్లతో రెండో ప్లేస్‌‌లో కొనసాగుతోంది. హంపి రెండు పాయింట్లతో ఆఖరి స్థానంలో నిలిచింది.