ఈస్ట్ రూథర్‌ఫోర్డ్: గ్రూప్–ఐ నుంచి నార్వే కూడా నాకౌట్‌కు చేరింది. మంగళవారం జరిగిన ఉత్కంఠ పోరులో నార్వే 3–2తో సెనెగల్‌ను ఓడించింది. ఎర్లింగ్ హాలాండ్ (48, 58వ ని), మార్కస్ పెడెర్సన్ (43వ ని) నార్వేకు గోల్స్ అందించగా, సెనెగల్ తరపున ఇస్మాయిల్ సర్ (53, 90+3) రెండు గోల్స్ చేశాడు.
1998 తర్వాత తొలిసారి వరల్డ్ కప్ ఆడుతున్న నార్వేను హాలాండ్ ఒంటిచేత్తో నాకౌట్‌కు చేర్చాడు. ప్రస్తుతం మెగా టోర్నీలో నాలుగు గోల్స్ చేసిన హాలాండ్.. గత 12 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో ప్రతీదాంట్లోనూ గోల్ కొట్టాడు. మొత్తం 24 గోల్స్ సాధించాడు. ఓవరాల్‌గా 52 మ్యాచ్‌ల్లో 59 గోల్స్ చేశాడు.
గత 50 ఏళ్లలో ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ కేన్ (2018) మాత్రమే ఈ ఘనత సాధించాడు. ఆట 13వ నిమిషంలో జూలియన్ రైర్సన్ గాయపడటంతో ప్రత్యామ్నాయ ప్లేయర్‌గా వచ్చిన పెడెర్సన్.. సెనెగల్ డిఫెండర్ కాప్టెన్ కౌలిబాలీని తప్పించి గోల్ కొట్టాడు. ఆ తర్వాత మెరుపు వేగంతో పరుగెత్తిన హాలాండ్ రెండు గోల్స్‌తో నార్వేను తిరుగులేని ఆధిక్యంలో నిలిపాడు. ఆట చివర్లో సెనెగల్ ప్లేయర్లు ఎదురుదాడికి దిగినా స్కోరును సమం చేయలేకపోయారు.
