కులం కారణంగా సొంత గ్రామస్థులే నన్ను ఒప్పుకోవడం లేదు

కులం కారణంగా సొంత గ్రామస్థులే నన్ను ఒప్పుకోవడం లేదు

ముంబై: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీకి గురించి తెలిసే ఉంటుంది. విలక్షన నటనా శైలితో హిందీ ఆడియన్స్‌‌‌లో ఆయన మంచి క్రేజ్ సంపాదించాడు. ఉత్తర్ ప్రదేశ్‌‌లో హత్రాస్ ఘటన నేపథ్యంలో అదే రాష్ట్రానికి చెందిన నవాజుద్దీన్ కుల మహమ్మారి గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ తానూ కుల వివక్షకు గురయ్యానని నవాజుద్దీన్ చెప్పాడు. ఇప్పటికీ సొంత గ్రామంలో తనను కొందరు అంగీకరించరించడం లేదన్నాడు. కొన్ని గ్రామాలు కుల రక్కసితో నిండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

‘ఇప్పటికీ సమాజంలో కులం వివక్షత అలాగే ఉంది. నా కుటుంబంలో మా నానమ్మది లోవర్ క్యాస్ట్‌‌. దీంతో ఇవాళ్టికి కూడా మా గ్రామస్థులు మమ్మల్ని ఒప్పుకోవడం లేదు. నేను ఫేమస్ అనేది వాళ్లకు అనవసరం. కులం వారిలో అంత లోతుగా ఇమిడిపోయింది. అది వారి నరనరాల్లో దాగి ఉంది. దాన్ని వాళ్లు గౌరవంగా భావిస్తారు’ అని నవాజుద్దీన్ పేర్కొన్నాడు. లేటెస్ట్‌‌గా సీరియస్ మ్యాన్ అనే నెట్‌‌ఫ్లిక్స్ ఫిల్మ్‌‌లో నవాజుద్దీన్ నటించాడు. ఈ మూవీలో తన కొడుకు సైన్స్ జీనియస్ అని అబద్ధం చెప్పే దళిత తండ్రి పాత్రలో నవాజుద్దీన్ అద్భుతంగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించాడు.