ప్రతిసారి వ్యాపార ధోరణితో ఉండకూడదు

ప్రతిసారి వ్యాపార ధోరణితో ఉండకూడదు
  • ‘ప్రాన్’ ఎయిర్ ప్యూరిఫయర్ ను ప్రారంభించిన కిషన్ రెడ్డి

హైదరాబాద్: వైద్య పరికరాలను తయారు చేసే కంపెనీలు ప్రతిసారి వ్యాపార ధోరణితోనే ఉండకూడదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఆదివారం తాజ్ దక్కన్ లో జైత్ర గ్రూప్ కి చెందిన ప్రాన్ ఏయిర్ ప్యురిఫయర్ ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన పెరిగిందన్నారు. ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. హాస్పిటల్ ఎక్విప్ మెంట్ దిగుమతులు తగ్గి  మన దగ్గరే పూర్తి స్థాయిలో ఉత్పత్తి  చేసే స్థాయికి ఎదగాలని సూచించారు.
ప్రాన్ పేరుతో ఈ డివైస్ ని మార్కెట్లోకి తీసుకొచ్చిన జైత్ర గ్రూప్ కి నా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి అత్యాధునిక పరికరాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. ఇప్పటికీ మనం సుమారు 40 లేదా 50 కోట్ల రూపాయల హాస్పిటల్ ఎక్విపేంట్ ని వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఇది మారాలి.. భారత్ లొనే అన్ని  తయారు చేస్కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో  కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కొత్త ఐడియాస్ తో వచ్చేవారికి ప్రభుత్వం చేయూత అందిస్తుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.