అరెస్టు చేశాక సమాచారం ఇవ్వకుంటే చట్ట వ్యతిరేకమే : హైకోర్టు

అరెస్టు చేశాక సమాచారం ఇవ్వకుంటే చట్ట వ్యతిరేకమే : హైకోర్టు

హైదరాబాద్, వెలుగుఅరెస్టు చేసేటప్పుడు క్రిమినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొసీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సీఆర్పీసీ) యాక్ట్ లోని సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 41బీని అమలు చేయాలని లేకుంటే  ఆ అరెస్టు చట్ట వ్యతిరేకం అవుతుందని హైకోర్టు కామెంట్ చేసింది. తెలంగాణ ప్రజాఫ్రంట్ ప్రతినిధి కృష్ణ, తెలుగు యూనివర్సిటీ స్టూడెంట్ మద్దిలేటిలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని, వారిని కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 41బి మేరకు అరెస్టు సమాచారాన్ని కుటుంబసభ్యులు,అక్కడి ప్రముఖులకు చెప్పాల్సి ఉంటుందని.. కృష్ణ, మద్దిలేటిల విషయంలో  ఇది అమలు చేశారో లేదో చెప్పాలని పోలీసుల్ని చీఫ్ జస్టిస్ ఆర్ చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ ప్రశ్నించింది.

పూర్తి వివరాల్ని నివేదించాలని డీజీపీ, హోంశాఖ, సిటీ పోలీసు కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఆదేశించింది. అరెస్టు చేశాక కోర్టులో హాజరుపరిచి చట్ట ప్రకారం పోలీసులు వ్యవహరించారని ప్రభుత్వ లాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. దీనిపై డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల్పించుకుని సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 41బిని అమలు చేశారో లేదో చెప్పాలని  అడగ్గా ఆయన సమయం కావాలన్నారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరపున లాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రఘునాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాదిస్తూ..41బీ అమలు చేయలేదు కాబట్టి అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్రమమని ప్రకటించాలని, సుప్రీంకోర్టు రూలింగ్ ఉన్నట్లు చెప్పారు. కృష్ణ, మద్దిలేటి అరెస్టు విషయంలో  41బి అమలు చేయనట్లుగా ఉందని  అభిప్రాయపడిన హైకోర్టు తర్వాతి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.