కరోనా ఎఫెక్ట్ .. ఎర్రకోట వద్ద ఖాళీ కుర్చీలు

కరోనా ఎఫెక్ట్ .. ఎర్రకోట వద్ద ఖాళీ కుర్చీలు

ఏటా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట పరిసరాలు జనంతో కిటకిటలాడుతూ సందడిగా కని పించేవి. లాన్స్ అన్నీ జనంతో నిండుగా కనిపించేవి. కానీ ఈసారి కరోనా మహమ్మారి కారణంగా ఎర్ర కోట వద్ద దాదాపు అన్ని ఎన్ క్లోజర్లలోనూ చాలా సీట్లు ఖాళీగా కనిపించాయి. గతంలో ఎప్పుడూ లేనట్లుగా వేడుకలకు గెస్టులు, జనం మాస్కులతో వచ్చారు. శానిటైజర్లు వాడుతూ, డిస్టెన్స్ పాటిస్తూ కనిపించారు. గేట్లవద్ద థర్మల్ స్క్రీనింగ్, హ్యాండ్ ఫ్రీ శానిటైజర్లు ఏర్పాటు చేసిన అధికారులు.. గెస్టుల సీట్లవద్ద సైతం ‘కరోనా’ కిట్లను ఉంచారు. మొత్తానికి ఈసారి కరోనా కారణంగా ఇండిపెండెన్స్ డే వేడుకలు రొటీన్ కు భిన్నంగా జరిగాయి.

డ్రోన్లపై లేజర్ వెపన్ తో నిఘా

ప్రధాని మోడీ ఇండిపెండెన్స్ డే స్పీచ్ సందర్భంగా ఎర్రకోట పరిసరాల్లో 3 కిలోమీటర్లవరకూ డ్రోన్ లపై లేజర్ వెపన్ తో నిఘా పెట్టారు. డీఆర్ డీవో తయారు చేసిన ఈ లేజర్ వెపన్ సిస్టమ్ 3 కిలోమీటర్ల పరిధిలో మైక్రో డ్రోన్ లను గుర్తించి, జామ్ చేయగలదు. 1 నుంచి 2.5 కిలోమీటర్లపరిధిలో ఎలాంటి డ్రోన్ లను అయినా నేల కూల్చగలదు.

ఎర్రకోట వద్ద ఖాళీ కుర్చీలు..

ఏటా ఇండిపెండెన్స్ డే వేడుకల సందర్భంగా ఎర్ర కోట లాన్స్ జనంతో కిటకిటలాడేవి. ఈసారి కరోనా ఎఫెక్ట్కారణంగా చాలావరకూ కుర్చీలు ఖాళీగా కని పించాయి. అటెండ్ అయినవారు సైతం మాస్కులు పెట్టుకుని, సోషల్ డిస్టె న్స్ పాటిస్తూ దూరం దూరంగా కూర్చుని కనిపించారు. ఏటా కనీసం 16 వేల మందిని వేడుకలకు ఇనవైట్ చేసేవారు. ఈసారి కేవలం 4 వేల  మందినే వేడుకలకు పిలిచారు. అయినా చాలా సీట్లు ఖాళీగా కనిపించాయి. గెస్టులకోసం ప్రతి సీటులో మాస్కు, శానిటైజర్ బాటిల్, ఒక జత గ్లౌవ్స్ తో కూడిన కిట్ ను కూడా ఉంచారు. ప్రతి చైర్ కు వెనకవైపున ఒక హ్యాండ్ టవల్, ప్రోగ్రాం పాంప్లెట్ కూడా పెట్టారు.

ఈసారి స్కూలు పిల్లలు రాలే..

ఏటా ఇండిపెండెన్స్ డే వేడుకలకు స్కూలు పిల్లలు జెండా రంగుల్లో దుస్తులు ధరించి వచ్చేవారు. కొన్నే ళ్లుగా ప్రోగ్రాం చివరలో ప్రధాని మోడీ వారిని కలిసి, షేక్ హ్యాండ్ సైతం ఇచ్చేవారు. కానీ ఈసారి కరోనా కారణంగా స్కూలు పిల్ల లకు ఆ అవకాశం లేకపో యింది. ‘‘ఈరోజు మన పిల్లలు మనతో పాటు లేరు. ఈ మహమ్మారి మనందరినీ ఇలా స్తంభింపచేసింది’’ అని ప్రధాని మోడీ కూడా విచారం వ్యక్తం చేశారు.

ఎన్ సీసీ క్యాడెట్లలో జోష్ నేషనల్ కెడెట్ కోర్(ఎన్ సీసీ) విభాగాలను ఇకపై బోర్డర్ ,కోస్టల్, ఏరియాల్లోని ఎడ్యుకేషనల్ ఇని స్టిట్యూట్లకు కూడా విస్తరిస్తామని ప్రధాని మోడీ తన స్పీచ్ లో ప్రకటించారు. దీంతో వేడుకలకు హాజరైన ఎన్ సీసీ కేడెట్లుఒక్కసారిగా హర్షం, వ్యక్తం చేశారు.

 హ్యాండ్ ఫ్యాన్లతో గెస్టు లకు రిలీఫ్..

సీనియర్ మంత్రులంతా అప్పర్ డయాస్ పై  కూర్చున్నా రు. వేడుకల సందర్భంగా ఉక్కపోతగా ఉండటంతో గెస్టులకు పంపిణీ చేసిన హ్యాండ్ ఫ్యాన్లు ఉపశమనం కలిగించాయి. వీటిని ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీకి చెందిన ట్రైఫెడ్ నుంచి డిఫెన్స్ మినిస్ట్రీ సేకరించింది.

సెక్యూరిటీ కట్టు దిట్టం..

ప్రధాని మోడీ జెండాను ఎగురవేసేటప్పుడు ఆయనకు మేజర్ శ్వేతాపాండే సహాయం చేశారు. ఎర్రకోట పరి సరాల్లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. వేదిక పరిసరాల్లో 300 సెక్యూరిటీ కెమెరాలు ఇన్ స్టాల్ చేశారు. ఫారిన్ లో మన జెండా రెపరెపలు విదేశాల్లోని మనోళ్లు ఇండిపెండెన్స్ డే వేడుకలు జోరుగా జరుపుకొన్నారు. మన జెండా ఎగురవేస్తూ, జాతీయ గీతం, దేశభక్తి పాటలు పాడుకుంటూ సంబరాలు జరుపుకున్నరు.