దేశంలో ఉల్లి కాదు.. టమాటా కన్నీళ్లు.. కిలో రూ. వంద దాటి పరుగులు

దేశంలో ఉల్లి కాదు.. టమాటా కన్నీళ్లు.. కిలో రూ. వంద దాటి పరుగులు

కొన్ని నగరాల్లో టమాటా ధరలు కిలోకు రూ.100కి చేరాయి. భారీ వర్షాల కారణంగా కూరగాయల రవాణాకు ఆటంకం ఏర్పడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

భారీ వర్షాల కారణంగా సరఫరా దెబ్బతినడంతో భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో టమాటా రిటైల్ ధరలు కిలోకు రూ. 100కి చేరుకున్నాయి. "టమాటా రూ. 80 కేజీల ధరకు అమ్ముడవుతోంది. గత రెండు మూడు రోజులుగా ధర ఒక్కసారిగా పెరిగింది. భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా ధర పెరిగింది. వర్షంతో టమాటాలు నాశనమయ్యాయి" అని ఢిల్లీకి చెందిన ఓ నివాసి చెప్పారు.   

ALSO READ:అభిమాని చేతిపై తమన్నా టాటూ.. కన్నీళ్లు పెట్టుకున్న మిల్కీ బ్యూటీ 

బెంగళూరు, రాయ్‌పూర్‌లలో టమాటా ధర కిలో రూ.100 దాటింది. దేశంలోని చాలా రిటైల్ మార్కెట్‌లలో వర్షాకాలానికి ముందు వర్షాలు కురుస్తున్నప్పటి నుంచి టమాట ధరలు ఎక్కువగా ఉన్నాయి. అయితే రుతుపవనాల ఆగమనంలో నిరంతర వర్షాల కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో టమాటా ధరల్లో తీవ్ర పెరుగుదల కనిపిస్తోంది. ఉత్తర ప్రాంతంలో టమాట రిటైల్ ధరలు కిలో రూ.30-80 మధ్య ఉండగా, పశ్చిమ ప్రాంతంలో కిలో రూ.30-85, తూర్పు ప్రాంతంలో కిలో రూ.39-80గా ఉన్నాయి.

https://twitter.com/ANI/status/1673525676975194112