ట్విట్టర్ ఉద్యోగుల రాజీనామాలపై ఎలాన్ మస్క్ ట్వీట్

ట్విట్టర్ ఉద్యోగుల రాజీనామాలపై ఎలాన్ మస్క్ ట్వీట్

ట్విట్టర్ లో మార్పులకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ టేకోవర్ చేసుకున్న తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 50శాతం ఉద్యోగులను తొలగించగా... పని గంటల్లోనూ కీలక మార్పులు చేశారు.  అలాంటి వాళ్లే ట్విట్టర్ లో కొనసాగాలని, లేకపోతే ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్లొచ్చని సూచిస్తూ ఉద్యోగులకు మెయిల్స్ పంపించారు. అయితే ఎలాన్ మస్క్ వార్నింగ్ తో ఉద్యోగులు ట్విట్టర్ కు రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే వందలాది మంది ఉద్యోగులు ట్విట్టర్ కు రాజీనామా చేశారు. 

అయితే ఉద్యోగుల వరుస రాజీనామాలపై ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. తానేం ఆందోళన చెందడం లేదని.. అత్యుత్తమ వ్యక్తులు మాత్రమే ఉంటారని రాసుకొచ్చారు. 44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో ట్విట్టర్ ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్.. రావడం రావడంతోనే నలుగురు కీలక ఉద్యోగులను తొలగించాడు. దీంతో పాటు బోర్డును రద్దు చేస్తూ.. తనే ఏకైక డైరెక్టర్ గా ఉన్నాడు. దీంతో పాటు ట్విట్టర్ బ్లూ టిక్, వెరిఫైడ్ ఖాతాదారులు నెలకు 8 డాలర్లు(ఇండియాలో రూ.719) చెల్లించాలని స్పష్టం చేశారు.