కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమే

కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమే

రాబోయే సాధారణ ఎన్నికలపై స్పందించారు  కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ అజాద్. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమేనన్నారు. 300 ఎంపీ సీట్లను సాధించి కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అధికారాన్ని చేపట్టే అవకాశాలు కనిపించడం లేదన్నారు. 300 సీట్లలో కాంగ్రెస్ గెలుపొందాలని తాను కోరుకుంటున్నానని... అయితే అది సాధ్యమయ్యేలా లేదని చెప్పారు.  

ఆర్టికల్ 370పై ఏన్నో ఏళ్ల నుంచి తానొక్కడినే మాట్లాడుతున్నానని... ప్రస్తుతం ఆ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఆ విషయం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనన్నారు గులాం నబీ అజాద్. ఆర్టికల్ రద్దుపై వెనక్కి వెళ్లేందుకు బీజేపీ సిద్ధంగా లేదని... కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేకపోవడంతో ఆర్టికల్ రద్దుపై హామీ ఇవ్వలేనని చెప్పారు. జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్రంపై అన్ని పార్టీలు కలిసి ఒత్తిడి తీసుకురావాలన్నారు.