నిజామాబాద్, వెలుగు : డిచ్పల్లి మండలం సుద్దపల్లి ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు కొంగర రోహిత్ రెండో వర్థంతి సందర్భంగా శుక్రవారం నోటు బుక్స్, పెన్సిల్లు, రబ్బర్లు, పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితిలో కూడా రోహిత్ మనోధైర్యం వీడకుండా చదువు కొనసాగించి సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాడని, తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన అతడు తన డెడ్‌బాడీని వైద్యవిద్యార్థుల పరిశోధన కోసం దానం చేశాడని అతని తండ్రి కొంగర శ్రీనివాసరావు తెలిపారు.
కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ నిజామాబాద్ రూరల్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్, మాధవ నగర్ సింగల్ విండో చైర్మన్ దాసరి నాగేశ్వరరావు, రైతు కూలి సంఘం అధ్యక్షుడు దేవారం, సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి పరుచూరి శ్రీధర్ మాట్లాడారు. పాఠశాల క్లస్టర్ హెడ్మాస్టర్ నరేశ్, స్థానిక హెడ్మాస్టర్ మంజుల, రోహిత్ తల్లి నీరజ, తమ్ముడు రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
