ప్రముఖ జర్నలిస్ట్ టీకే లక్ష్మణ్ రావు కన్నుమూత

ప్రముఖ జర్నలిస్ట్ టీకే లక్ష్మణ్ రావు కన్నుమూత

గచ్చిబౌలి, వెలుగు: ప్రముఖ జర్నలిస్ట్​ టీకే లక్ష్మణ్​రావు(70), అనారోగ్యంతో హైదరాబాద్‌‌‌‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు.  ఆయన పార్థివదేహాన్ని గోపన్​పల్లి జర్నలిస్టు కాలనీలోని తన ఇంటికి తరలించారు. సబ్​ ఎడిటర్​గా జర్నలిస్ట్​ జీవితాన్ని ప్రారంభించిన లక్ష్మణ్​రావు ఉదయం, ఆంధ్రభూమి, వార్త, సాక్షి వంటి ప్రధాన దినపత్రికల్లో వివిధ హోదాల్లో మూడున్నర దశాబ్దాలకు పైగా పని చేశారు. ‘మఫిసిల్ స్పెషలిస్టు’ గా పేరుపొందారు.

సాక్షిలో అసోసియేట్​ఎడిటర్​గా రిటైర్డ్ అయ్యారు. ఆయనకు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. లక్ష్మణ్​రావు మృతి పట్ల సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టు సంఘాల నేతలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలిపారు.  బుధవారం సాయంత్రం జూబ్లీహిల్స్​మహాప్రస్థానంలో లక్ష్మణ్​రావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు, సన్నిహితులు తెలిపారు.