వివాహ వేడుకలో కరెన్సీ నోట్ల వర్షం

వివాహ వేడుకలో కరెన్సీ నోట్ల వర్షం

గుజరాత్‌లో ఓ పెళ్లి సందర్భంగా నోట్ల వర్షం కురిసింది. వాటిని అందుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు.  తమ కుమారుడి వివాహం సందర్భంగా  మెహ్‌సాణా జిల్లా కడీ తాలుకాలోని మాజీ గ్రామ సర్పంచ్ మేనల్లుడు రజక్‌ వివాహం నేపథ్యంలో ఆ కుటుంబం రూ.10 నుండి రూ.500 నోట్ల విలువైన కరెన్సీ నోట్లను గాల్లోకి వెదజల్లారు. బిల్డింగ్ కిందనున్న స్థానికులు ఆ నోట్లను అందుకునేందు ప్రయత్నం చేసే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి భవనం పైనుంచి కరెన్సీ నోట్లను కిందికి వదులుతుండగా.. కిందనున్న జనం వాటిని చేజిక్కించుకునేందుకు ఎగబడుతున్నారు. అయితే తమ కుటుంబంలో రజక్ ఒక్కడే మగ సంతానం అని, అందుకే ఆ కుటుంబం ఇలా చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.