పరువు నష్టం కేసులో సంజయ్ రౌత్​, ఉద్ధవ్ థాక్రేకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

పరువు నష్టం కేసులో సంజయ్ రౌత్​, ఉద్ధవ్ థాక్రేకు  ఢిల్లీ హైకోర్టు నోటీసులు
  •     30 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య థాక్రే, వారి వర్గం నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్​ రౌత్​కు ఢిల్లీ హైకోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. మహారాష్ట్ర సీఎం ఏక్‌‌నాథ్‌‌ షిండే వర్గం నేత రాహుల్‌‌ రమేశ్‌‌ షెవాలే వారిపై పరువు నష్టం కేసు వేశారు. శివసేనకు చెందిన ‘సామ్నా’లో గతంలో రాహుల్‌‌ రమేశ్‌‌పై కథనం ప్రచురించింది. కరాచీలో హోటల్‌‌, రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారం చేస్తున్నట్లు తనపై నిరాధారమైన ఆరోపణలు చేసింది. దీంతో తన ప్రతిష్టను దెబ్బతీశారంటూ రాహుల్ రమేశ్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించగా.. ఉద్ధవ్‌‌ ఠాక్రే, ఆదిత్య థాక్రే, సంజయ్‌‌ రౌత్‌‌లకు సమన్లు జారీ చేసింది. 30రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.