సూర్యాపేట జిల్లాలో వైన్ షాపులకు నోటిఫికేషన్.. రిజర్వేషన్ కేటాయింపులు ఇలా..

సూర్యాపేట జిల్లాలో వైన్ షాపులకు నోటిఫికేషన్.. రిజర్వేషన్ కేటాయింపులు ఇలా..

సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 2025-27 సంవత్సరానికి వైన్ షాపులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కలెక్టర్ నంద్ లాల్ పవార్.  రిజర్వేషన్ కేటాయింపులు పారదర్శకంగా కేటాయించామని ఈ సందర్భంగా తెలిపారు. జిల్లాలో ఉన్న మొత్తం 93 వైన్ షాప్ లకు సంబంధించి రిజర్వేషన్ కేటాయింపుల గురించి వివరించారు. 

నోటిఫికేషన్ శుక్రవారం (సెప్టెంబర్ 26) జారీ చేయనున్నారు. రిజర్వేషన్ కేటాయింపులు ఇలా ఉన్నాయి. ఎస్ లకు 3 షాపులు, ఎస్సీ లకు 10 , గౌడ్స్ కు 27 , మిగతా 53 షాపులు ఓపెన్ ఫర్ ఆల్ కేటగిరీకి కేటాయించినట్లు చెప్పారు. 93 నెంబర్లు బాక్స్ లో వేసి లాటరీ పద్దతిలో రిజర్వేషన్లు కేటాయించారు.