పోస్టల్​లో డాక్ సేవక్ పోస్టులు

పోస్టల్​లో డాక్ సేవక్  పోస్టులు

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌‌‌‌ సర్కిళ్లలో 30,041 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌‌‌‌) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్‌‌‌‌పోస్టు మాస్టర్‌‌‌‌(బీపీఎం), అసిస్టెంట్‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌ పోస్టు మాస్టర్‌‌‌‌(ఏబీపీఎం), డాక్‌‌‌‌ సేవక్‌‌‌‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో 1058, తెలంగాణలో 961 ఖాళీలు ఉన్నాయి.


అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్‌‌‌‌, ఇంగ్లీష్‌‌‌‌, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌‌‌‌ తొక్కటం రావాలి. వయసు 18 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి. నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380; ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 - –  రూ.24,470 వేతనం చెల్లిస్తారు.


ఎంపిక: అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌‌‌‌ ప్రకారం నియామకాలు చేపడతారు. 
బ్రాంచ్‌‌‌‌ పోస్టు మాస్టర్‌‌‌‌(బీపీఎం): ఈ పోస్టుకు ఎంపికైనవారు సంబంధిత బ్రాంచ్‌‌‌‌ కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్‌‌‌‌ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్‌‌‌‌ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. నాయకుడిగా సంబంధిత బ్రాంచ్‌‌‌‌ను నడిపించాలి. పోస్టల్‌‌‌‌ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి.


అసిస్టెంట్‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌ పోస్టుమాస్టర్‌‌‌‌(ఏబీపీఎం): ఈ ఉద్యోగంలో చేరినవాళ్లు స్టాంపులు/ స్టేషనరీ అమ్మకం, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూడటం, ఇండియన్‌‌‌‌ పోస్టు పేమెంట్‌‌‌‌ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, ఇతర లావాదేవీలు సైతం  చూసుకోవాలి.


డాక్‌‌‌‌ సేవక్‌‌‌‌: ఈ విధుల్లో చేరినవారు ఉత్తరాలు పంపిణీ చేయాలి. అలాగే స్టాంపులు/ స్టేషనరీ అమ్మకాలు చేయాలి. బీపీఎం, ఏబీపీఎం సూచించిన పనులు పూర్తిచేయాలి. పోస్టల్‌‌‌‌ పథకాలు ప్రచారం చేయాలి.


దరఖాస్తులు: అభ్యర్థులు ఆగస్టు 23 వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.indiapostgdsonline.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.