అస్టానా ఓపెన్ టైటిల్ గెలిచిన జకోవిచ్

అస్టానా ఓపెన్ టైటిల్ గెలిచిన జకోవిచ్

సెర్బియా టెన్నిస్ స్టార్..మాజీ ప్రపంచ నెంబర్ వన్ ..నోవాక్ జకోవిచ్..90వ టైటిల్ను దక్కించుకున్నాడు. అస్టానా ఓపెన్ టోర్నీలో జకోవిచ్..విజేతగా నిలిచాడు. గ్రీస్ టెన్నిస్ ప్లేయర్..స్టెఫోనోస్ సిట్సిపాస్పై జకోవిచ్..6-3, 6-4తో వరుస సెట్లలో విజయం సాధించాడు. 

ఏక పక్షంగా మ్యాచ్
75 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో..జకోవిచ్ అదరగొట్టాడు. సిట్సిపాస్ పై అన్ని విధాలుగా పైచేయి సాధించాడు. ఫస్ట్ సెట్ ను 6-3తో గెలుచుకున్న జకో..రెండో సెట్ ను 6-4తో దక్కించుకున్నాడు. కరోనా-19 వ్యాక్సినేషన్‌కు నిరాకరించి మెగా టోర్నీలకు దూరమైన జకోవిక్‌ విరామ సమయంలో మరింతగా పుంజుకుని గొప్పగా పునరాగమనం చేస్తున్నాడు. 

కెరీర్ గొప్పగానే సాగుతుంది..
తన టెన్నిస్ కెరీర్ గొప్పగా సాగుతుందని జకోవిచ్ అన్నాడు. తన కెరీర్ లో 90 టైటిళ్లు సాధిస్తానని ముందే అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే తాను ఇంకెన్ని ఫైనల్స్‌ ఆడతానో తెలియదన్నాడు. కానీ కచ్చితంగా టెన్నిస్‌లో ఉన్నత స్థాయికి చేరుకుంటానన్న నమ్మకం ఉందని..జకోవిచ్ అన్నాడు.