జొకోవిచ్ కే యూఎస్ ఓపెన్ టైటిల్.. ఓపెన్ శకంలో సరికొత్త చరిత్ర

జొకోవిచ్ కే యూఎస్ ఓపెన్ టైటిల్.. ఓపెన్ శకంలో సరికొత్త చరిత్ర


పురుషుల టెన్నిస్ లో సెర్బియన్ స్టార్ జొకోవిచ్ కి తిరుగు లేకుండా పోతుంది. ఇప్పటికే ఈ  ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్న నోవాక్.. ఆదివారం (సెప్టెంబర్ 10) అర్ధ రాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్లో మెద్వెదేవ్‌ను ఓడించి ఈ ఏడాది మూడో గ్రాండ్ స్లామ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఏకపక్షంగా జరిగిన ఈ పోరులో జొకోవిచ్ 6-3, 7-6 (5), 6-3 తేడాతో విజయం సాధించి 2021 మెద్వెదేవ్‌ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. 

జొకోవిచ్ కి ఇది నాలుగో యూఎస్ ఓపెన్ టైటిల్ కాగా.. ఓవరాల్ గా 24 వ టైటిళ్లతో టాప్ లో కొనసాగుతున్నాడు. ఈ లిస్టులో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్(22), స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ రెండు మూడు స్థానాల్లో నిలిచారు. దీంతో ఓపెన్ శకంలో మార్గరెట్ కోర్ట్ రికార్డు 24 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిళ్లను సమం చేసి చరిత్ర చరిత్ర సృష్టించాడు. 36 ఏళ్ల సెర్బియా స్టార్ 24 వ ట్రోఫీ గెలవడం పట్ల తన సంతోషం వ్యక్తం చేస్తూ.. ఇన్ని సంవత్సరాల తన ప్రయాణంలో అండగా ఉన్న తన కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేశాడు.