నిషియోకాను మట్టి కరిపించిన జొకోవిచ్

నిషియోకాను మట్టి కరిపించిన జొకోవిచ్

టెన్నిస్ లో పురుషుల ప్రపంచ నెంబర్ వన్, సెర్బియా స్టార్ అంటూ పిలుచుకొనే నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌‌లో శుభారంభం చేశాడు. తొలి రౌండ్ మ్యాచ్‌‌లో జపాన్ కు చెందిన యోషియిపై గెలుపొందాడు. బలమైన షాట్లు కొడుతూ.. యోషియికు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. వరుస సెట్లలో ఖంగు తినిపించాడు. నొవాక్ జొకోవిచ్ ఆదివారం పుట్టిన రోజు జరుపుకుని.. సోమవారం టెన్నిస్ గ్రౌండ్‌‌లో అడుగు పెట్టాడు. 99వ ర్యాంకర్ అయిన యోషియితో అర్ధరాత్రి  మ్యాచ్ జరిగింది. యోషియిపై 6-3, 6-1, 6-0 తేడాతో గెలుపొందాడు జొకోవిచ్. ఇప్పటి వరకు ఫ్రెంచ్ ఓపెన్ లో ఒక్కసారిగా కూడా తొలి రౌండ్ ఓడలేకపోవడం విశేషం. 18-0తో జొకోవిచ్ తన రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాుడు. ఈవెంట్ లో ఇది అతనికి 82వ విజయం.

ఇదిలా ఉంటే.. జొకోవిచ్..జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ లో ఇతను ఆడలేదు. కరోనా వ్యాక్సిన్ వేసుకోని కారణంగా.. ఆస్ట్రేలియా గవర్నమెంట్ అతడిపై నిషేధం విధించింది. వీసా అనుమతులు, వైద్య పరమైన మినహాయింపులున్నా.. వ్యాక్సినేషన్ కు సంబంధించి ధృవపత్రాలు లేని కారణంగా.. ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ అధికారులు అడ్డుకున్నారు. జకోవిచ్ వీసాను రద్దు చేసి డిటెన్షన్ సెంటర్ లో ఉంచడంతో ఈ విషయం పెద్ద దుమారమే రేపింది. ఆస్ట్రేలియా వ్యవహరించిన తీరుపై న్యాయ పోరాటం చేయాలని జొకోవిచ్ నిర్ణయం తీసుకున్నాడు. తన లాయర్ల ద్వారా మెల్ బోర్న్ లోని ఫెడరల్ కోర్టుకు వినిపించాడు. కానీ గ్రాండ్ స్లామ్ మ్యాచ్ ల్లో ఆడలేకపోయాడు. మూడేళ్ల పాటు అతను ఆసీస్ గడ్డపై అడుగు పెట్టకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

మరిన్ని వార్తలు కోసం :-

ఫైనల్‌ బెర్త్‌ ఎవరిదో?


ట్రయల్ బ్లేజర్స్పై నోవాస్ విజయం