యుగానికొక్కడు.. 24 గ్రాండ్​స్లామ్స్​తో జొకోవిచ్​ హిస్టరీ

యుగానికొక్కడు.. 24 గ్రాండ్​స్లామ్స్​తో జొకోవిచ్​ హిస్టరీ
  • సెరెనాను దాటి మార్గరేట్‌‌‌‌‌‌‌‌ రికార్డు సమం
  • యూఎస్​ ఓపెన్​ గెలిచిన నొవాక్​
  • ఫైనల్లో ఓడిన డానిల్‌‌‌‌‌‌‌‌ మెద్వెదెవ్‌‌‌‌‌‌‌‌

న్యూయార్క్‌‌‌‌‌‌‌‌:  టెన్నిస్‌‌‌‌‌‌‌‌లో తనకు తిరుగులేదని.. ఈ ఆటలో తనను పడకొట్టే మొనగాడు లేడని సెర్బియా లెజెండ్‌‌‌‌‌‌‌‌ నొవాక్‌‌‌‌‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌‌‌‌‌ మరోసారి చాటి చెప్పాడు. మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికే అత్యధికంగా 23 గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్స్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన జొకోవిచ్‌‌‌‌‌‌‌‌ తన కసి, విజయకాంక్ష తగ్గలేదని నిరూపించాడు. ఖతర్నాక్‌‌‌‌‌‌‌‌ ఆటతో యూఎస్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో విజేతగా నిలిచి 24వ గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌తో కొత్త చరిత్ర సృష్టించాడు. ఓపెన్‌‌‌‌‌‌‌‌ ఎరాలో అత్యధిక గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్స్‌‌‌‌‌‌‌‌ గెలిచిన ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా అమెరికా లెజెండ్‌‌‌‌‌‌‌‌ సెరెనా విలియమ్స్‌‌‌‌‌‌‌‌(23) రికార్డు బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఆస్ట్రేలియాకు చెందిన మార్గరేట్‌‌‌‌‌‌‌‌ కోర్ట్‌‌‌‌‌‌‌‌ (24) పేరిట ఉన్న ఆల్‌‌‌‌‌‌‌‌టైమ్‌‌‌‌‌‌‌‌ హయ్యెస్ట్‌‌‌‌‌‌‌‌ గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్స్‌‌‌‌‌‌‌‌ రికార్డును సమం చేశాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో రెండో సీడ్‌‌‌‌‌‌‌‌ నొవాక్‌‌‌‌‌‌‌‌  6–-3, 7–-6 (7/5), 6-–3తో రష్యా స్టార్‌‌‌‌‌‌‌‌ డానిల్‌‌‌‌‌‌‌‌ మెద్వెదెవ్‌‌‌‌‌‌‌‌ను వరుస సెట్లలో ఓడించాడు. 2021లో ఇదే టోర్నీ ఫైనల్లో డానిల్‌‌‌‌‌‌‌‌ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న సెర్బియ వీరుడు యూఎస్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో నాలుగోసారి విజేతగా నిలిచాడు. ఇప్పటికే ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో పది, ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో మూడు, వింబుల్డన్‌‌‌‌‌‌‌‌లో ఏడు టైటిళ్లు సాధించాడు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో మూడో గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన జొకోవిచ్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీతో రూ. 24.90 కోట్ల ప్రైజ్‌‌‌‌‌‌‌‌మనీ అందుకున్నాడు. రన్నరప్‌‌‌‌‌‌‌‌ డానిల్‌‌‌‌‌‌‌‌ మెద్వెదెవ్‌‌‌‌‌‌‌‌ రూ. 12.45 కోట్లు ఖాతాలో వేసుకున్నాడు. 

అద్భుత పోరాటం

ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగిన నొవాక్‌‌‌‌‌‌‌‌ ఊహించినట్టే టైటిల్‌‌‌‌‌‌‌‌ గెలిచినా అది అంత సులభంగా రాలేదు.  ఫైనల్లో27 ఏండ్ల మెద్వెదెవ్‌‌‌‌‌‌‌‌ నుంచి గట్టి సవాల్‌‌‌‌‌‌‌‌ ఎదుర్కొన్నాడు. తొలి సెట్‌‌‌‌‌‌‌‌ను 6–3తో సులువుగానే గెలిచిన తర్వాత అసలు ఫైట్‌‌‌‌‌‌‌‌ మొదలైంది. రెండో సెట్‌‌‌‌‌‌‌‌ ఏకంగా గంటా 44 నిమిషాలు హోరాహోరీగా నడించింది. ఒక్కో పాయింట్‌‌‌‌‌‌‌‌ కోసం ఇరువురూ భారీ ర్యాలీలు ఆడాల్సి వచ్చింది. విపరీతమైన వేడి, ప్రతికూల వాతావరణంలోనూ 36 ఏండ్ల నొవాక్‌‌‌‌‌‌‌‌ అద్భుతంగా పోరాడాడు. రెండో సెట్‌‌‌‌‌‌‌‌ను టై బ్రేక్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లిన నొవాక్‌‌‌‌‌‌‌‌ అక్కడ కూడా గట్టి పోటీనే ఎదుర్కొన్నాడు. అయితే 4–5తో వెనుకబడిన దశలో వరుసగా పాయింట్స్​ గెలిచి  సెట్‌‌‌‌‌‌‌‌ సొంతం చేసుకున్నాడు. మూడో సెట్‌‌‌‌‌‌‌‌లో సెర్బియా స్టార్‌‌‌‌‌‌‌‌ తన బెస్ట్‌‌‌‌‌‌‌‌ ఆటను బయటకు తీశాడు. స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌లో మెద్వెదెవ్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేసి బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌ రాబట్టిన అతను సర్వీస్‌‌‌‌‌‌‌‌ నిలబెట్టుకొని 3–1తో లీడ్‌‌‌‌‌‌‌‌ సాధించాడు. అదే జోరును కొనసాగిస్తూ తన సర్వీస్‌‌‌‌‌‌‌‌ తొమ్మిదో గేమ్‌‌‌‌‌‌‌‌లో చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌ కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో  నొవాక్‌‌‌‌‌‌‌‌  తన స్టయిల్‌‌‌‌‌‌‌‌కు భిన్నంగా సర్వ్‌‌‌‌‌‌‌‌ చేసిన వెంటనే వాలీ షాట్లు కొట్టాడు. నెట్‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌లో అతనికి తిరుగులేకుండా పోయింది. టైటిల్​ నెగ్గిన వెంటనే తన కూతురును హగ్​ చేసుకున్న నొవాక్​ ఎమోషనల్​ అయ్యాడు.

 టెన్నిస్‌‌‌‌‌‌‌‌ హిస్టరీలో జొకోవిచ్​ అత్యధికంగా 24 గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్స్‌‌‌‌‌‌‌‌ నెగ్గి మార్గరేట్‌‌‌‌‌‌‌‌ కోర్ట్‌‌‌‌‌‌‌‌ రికార్డు సమం చేశాడు. 1968లో మొదలైన ఓపెన్‌‌‌‌‌‌‌‌ ఎరాలో 24 టైటిళ్లు గెలిచిన ఏకైక ప్లేయర్‌‌‌‌‌‌‌‌ జొకోవిచ్​. మార్గరేట్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్స్‌‌‌‌‌‌‌‌లో 13 అమెచ్యూర్‌‌‌‌‌‌‌‌ ఎరాలో వచ్చాయి.

ఈ ఏడాది జొకో గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్స్‌‌‌‌‌‌‌‌ నెగ్గాడు. యూఎస్‌‌‌‌‌‌‌‌తో పాటు ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌, ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌  ఓపెన్లలో గెలిచాడు. ఇలా ఒకే సీజన్‌‌‌‌‌‌‌‌లో అతను మూడు టైటిళ్లు గెలవడం ఇది నాలుగోసారి.   ఇది వరకు 2011, 2015, 2021లోనూ ఈ ఘనత సాధించిన అతను రోజర్ ఫెడరర్‌‌‌‌‌‌‌‌ (2004, 2006, 2007) రికార్డు బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేశాడు.

ఓపెన్‌‌‌‌‌‌‌‌ ఎరాలో యూఎస్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో టైటిల్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన ఓల్డెస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా 36 ఏండ్ల 3 నెలల  జొకోవిచ్‌‌‌‌‌‌‌‌ రికార్డు సృష్టించాడు. 1970లో 35 ఏండ్ల 10 నెలల వయసులో గెలిచిన కెన్‌‌‌‌‌‌‌‌ రోస్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ను అధిగమించాడు.