
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం వాటర్సప్లయ్నిలిచిపోతుందని వాటర్బోర్డు అధికారులు తెలిపారు. ఆలియాబాద్ రిజర్వాయర్ పరిధిలోని 33/11 కేవీ పంపింగ్ స్టేషన్‌లో విద్యుత్ నిర్వహణ పనుల కారణంగా గురువారం బాదం మసీదు, బాలాగంజ్, మహంకాళి టెంపుల్, లాల్ దర్వాజ, మిత్ర క్లబ్, ఛత్రినాక, గాంధీ విగ్రహం, శ్రీనివాస్ హైస్కూల్ ఏరియా, శ్రీరామ్ నగర్, పాండురంగారావు వీధి, సీఐబీ క్వార్టర్స్, హరిజన బస్తీ, గౌలిపురా, మేకల మండి, సర్దార్ పటేల్ నగర్, లక్ష్మీనగర్, హమామ్ బౌలి, బోయిగూడ, కందికల్ గేట్, డీకే కాలనీ, రాజన్న బౌలి, ఖాద్రి చమాన్ ఏరియాల్లో వాటర్సప్లయ్ఉండదని స్పష్టం చేశారు.