మీ ఇంట్లో కుక్క లేదా పిల్లి ఉందా ? 5 కోట్ల వరకు చికిత్స ఫ్రీ.. అవి తప్పిపోయినా కూడా డబ్బులు..

మీ ఇంట్లో కుక్క లేదా పిల్లి ఉందా ?  5 కోట్ల వరకు చికిత్స ఫ్రీ.. అవి తప్పిపోయినా కూడా డబ్బులు..

మీ ఇంట్లో కుక్క లేదా పిల్లి ఉందా ? వాటిని ఇంట్లో ఒకరిగా చూసుకుంటున్నా, వాటి తిండి, టీకాలు, డాక్టర్ ఖర్చులు చూస్తే అమ్మో అనిపిస్తుందా ? ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు!  ఎందుకంటే మీ ఫ్యామిలీతో పాటు మీ ఇంట్లో పెంపుడు జంతువులకు (Pet Animals) కూడా కలిపి ఒకే ప్లాన్‌లో ఆరోగ్య బీమా అందించే ఒక కొత్త పథకం మార్కెట్లోకి వచ్చేసింది.

ఏంటి ఈ కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్?
ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ 'బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్' దేశంలోనే మొట్టమొదటిసారిగా ‘మై ఫ్యామిలీ కంప్లీట్’ (My Family Complete) అనే సరికొత్త హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇకపై పెంపుడు జంతువుల కోసం విడిగా ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన పనిలేదు. మీ కుటుంబికులు, మీ పెంపుడు కుక్కలు, పిల్లులు అన్ని ఒకే పాలసీ కింద కవర్ అవుతాయి.

ఎంత వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది?
మీ అవసరాలను బట్టి రూ.5 లక్షల నుండి ఏకంగా రూ.5 కోట్ల వరకు సమ్ ఇన్స్యూర్డ్ (Sum Insured) తీసుకోవచ్చు. ఈ పాలసీ ఒక్కసారి తీసుకుంటే 5 ఏళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది. మనుషులతో పాటు పెంపుడు జంతువులకు కూడా హాస్పిటల్లో చేరినప్పుడు అయ్యే ఖర్చులు, చేరకముందు-తర్వాత అయ్యే మెడికల్ ఖర్చులు, ఆధునిక వైద్య చికిత్సలు, కోలుకోవడానికి అయ్యే ఖర్చులన్నీ ఇందులో కవర్ అవుతాయి.

ఈ పాలసీ  ప్రయోజనాలు
ఒకవేళ మీ పెంపుడు జంతువు ఎక్కడైనా తప్పిపోతే, దానిని వెతకడానికి అయ్యే ఖర్చులను కూడా ఈ పాలసీ భరిస్తుంది. మీ కుక్క లేదా పిల్లి వల్ల వేరే ఎవరికైనా హాని జరిగినా లేదా ఇతరుల వస్తువులు పాడైనా ఆ నష్టాన్ని కూడా కవర్ చేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో జంతువులను సంరక్షణ కేంద్రాల్లో (Pet Boarding/Shelter) ఉంచాల్సి వస్తే ఆ ఖర్చులను కూడా అందిస్తుంది. ఇంట్లో కొత్తగా పాప/బాబు పుట్టినా, లేదా కొత్తగా పెంపుడు జంతువు పుట్టినా ప్రత్యేకంగా ఒక ఫిక్స్డ్ క్యాష్ బెనిఫిట్ ఇస్తారు.

ఇంకా  గ్లోబల్ కవర్ (విదేశీ వైద్యం), డబుల్ సమ్ ఇన్స్యూర్డ్, ఏజ్ షీల్డ్, పెంపుడు జంతువుల దత్తతకు (Pet Adoption) మద్దతు వంటి చాల మంచి ఆప్షన్లు ఈ పాలసీలో  ఉన్నాయి. ఒకే బీమా పాలసీతో ఇంటి వారితో పాటు ఇంట్లో  పెంపుడు జంతువుల ఆరోగ్యానికీ పూర్తి భరోసా లభించడం విశేషం. పెంపుడు జంతువుల ప్రేమికులకు ఇది నిజంగా ఒక మంచి ఛాయిస్ అని చెప్పాలి!