
ఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) విధానం సూపర్ ఫాస్ట్‌గా మారనుంది. ఈ ఏడాది జూన్ 16 నుంచి యూపీఐ లావాదేవీలు మరింత వేగంగా జరనున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) రెస్పాన్స్ సమయాన్ని తగ్గించడం ద్వారా ఈ మార్పును తీసుకురానుంది. డెబిట్, క్రెడిట్ చెల్లింపుల కోసం ప్రస్తుతం ఉన్న 30 సెకన్ల సమయం 15 సెకన్లకు తగ్గుతుంది.
లావాదేవీల స్టేటస్‌ను తెలుసుకోవడానికి, విఫలమైన లావాదేవీల రివర్సల్ కోసం పట్టే సమయం కూడా 30 సెకన్ల నుండి 10 సెకన్లకు తగ్గుతుంది. అడ్రస్ వెరిఫికేషన్ సమయాన్ని కూడా 15 సెకన్ల నుండి 10 సెకన్లకు కుదించారు. బ్యాంకులు, చెల్లింపు సేవలందించే సంస్థలు (పీఎస్పీలు) తమ వ్యవస్థలను ఈ కొత్త సమయాలకు అనుగుణంగా మార్చుకోవాలని ఎన్సీపీఐ సూచించింది.