ఇంటర్‍ లింకింగ్‍ వైర్ల పనులు స్పీడప్‍ చేయండి : కర్నాటి వరుణ్‍రెడ్డి

ఇంటర్‍ లింకింగ్‍ వైర్ల పనులు స్పీడప్‍ చేయండి : కర్నాటి వరుణ్‍రెడ్డి
  • అధికారులను ఆదేశించిన ఎన్‍పీడీసీఎల్‍ సీఎండీ 

వరంగల్‍, వెలుగు: ఎన్‍పీడీసీఎల్‍ పరిధి16 సర్కిళ్లలో ఇంటర్‍ లింకింగ్‍ వైర్ల పనులు స్పీడప్‍ చేయాలని సీఎండీ కర్నాటి వరుణ్‍రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన గ్రేటర్‍ వరంగల్ లోని విద్యుత్‍ భవన్‍లో సీఈలు, నోడల్‍ జీఎంలతో రివ్యూ నిర్వహించి మాట్లాడారు. 50 – 60 కిలోమీటర్ల మేర పొడవాటి లైన్లు ఉన్నచోట కొత్త సబ్‍ స్టేషన్లకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు.  టౌన్‍ లలో బ్రేక్‍ డౌన్స్, ట్రిప్పింగ్స్ లేకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు.  

సబ్‍ స్టేషన్లలో పనులు చేసినప్పుడు కరెంట్‍ సరఫరాలో అంతరాయం లేకుండా మరో సబ్‍ స్టేషన్‍ నుంచి ప్రత్యామ్నయం చూసుకోవాలని సూచించారు. పెండింగ్ లోని వ్యవసాయ సర్వీసులను రిలీజ్ స్పీడప్ చేయడంతో పాటు రెవెన్యూ కలెక్షన్లు వందశాతం వసూలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్ చార్జ్ డైరెక్టర్లు అశోక్‍ కుమార్‍, సదర్‍లాల్‍, తిరుపతిరెడ్డి, మధుసూదన్‍, సీఈలు తిరుమల్‍ రావు, రాజుచౌహన్‍, అశోక్‍, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.