నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం: కర్నాటి వరుణ్ రెడ్డి

నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం: కర్నాటి వరుణ్ రెడ్డి
  • ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి

గుండాల, వెలుగు : లో వోల్టేజ్  సమస్య లేకుండా గుండాల, ఆళ్లపల్లి సబ్  స్టేషన్లలో 5 ఎంవీఏ బూస్టర్లు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యుత్​ సరఫరా చేస్తున్నామని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. వినియోగదారులతో  నేరుగా మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  గుండాల, ఆళ్లపల్లి మండలాల్లోని లింగగూడెం, సాయనపల్లి, గుండాల, ముత్తాపురం, మామకన్ను గ్రామాల్లో ఆయన పర్యటించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త వ్యవసాయ సర్వీసుల మంజూరుకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సాయనపల్లి  గ్రామంలో పర్యటిస్తూ కొత్త సబ్  స్టేషన్ కు స్థల సేకరణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముత్తపురంలో  కూడా కొత్త సబ్  స్టేషన్ కు స్థల సేకరణ చేస్తే సబ్  స్టేషన్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు.