ఎన్పీడీసీఎల్ లో పవర్ కట్​కు చెక్

ఎన్పీడీసీఎల్ లో పవర్ కట్​కు చెక్

నిర్మల్, వెలుగు: విద్యుత్ వినియోగదారులకు సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ఎన్పీడీసీఎల్ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఇందుకు మోడ్రన్ టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ.. కరెంటు సరఫరా, బిల్లులు సక్రమంగా వసూలు , ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవడం వంటివాటిపై ఫోకస్ పెడుతోంది. 

దీంతో నిర్వహణ అంతా ఇకనుంచి ఆన్ లైన్ లోనే చేపట్టేందుకు సిద్ధమైంది. కమాండ్ కంట్రోల్ సిస్టం ఏర్పాటు చేసి బిల్లింగ్, కలెక్షన్, ఇంటరప్షన్, కంప్లైంట్స్ వంటి వివరాలను  ఒకేచోట అందుబాటులో ఉంచనుంది. ఎక్కడ కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడినా వెంటనే తెలుసుకునేందుకు చర్యలు చేప ట్టింది. 33 అలాగే 11 కేవీ విద్యుత్ స్తంభాలకు యూనిక్ నంబర్లను కూడా కేటాయించింది. లొకేషన్ మ్యాపింగ్ తో ట్రాన్స్ ఫార్మర్ లు‌‌, లైన్ లలో ఏర్పడే అంతరాయాలను సత్వరమే గుర్తించనుంది. 

డిస్కం ఇన్ఫర్మేషన్ కు డాష్ బోర్డ్ అప్లికేషన్ 

డిస్కంకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు డాష్ బోర్డు అప్లికేషన్ ను సంస్థ తేనుంది. కరెంటు పంపిణీలోని అంతరాయాలను లెక్కించేందుకు రెండు కొత్త ఇండెక్స్ సిస్టమ్ లను అమలు చేయనుంది.