
హైదరాబాద్,వెలుగు: కరోనా ట్రీట్‌మెంట్‌కు ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారన్న కంప్లయింట్స్ పై రాష్ట్రంలోని యశోద, కేర్, మెడికవర్ హాస్పిటళ్లకు నేషనల్ ఫార్మా సూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్ పీపీఏ) నోటీసులు జారీ చేసింది. దీనికి 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు మూడు హాస్పిటళ్లకు ఎన్‌పీపీఏ డిప్యూటీ డైరెక్టర్ మంజేశ్ పర్వల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మూడు ఆస్పత్రులపై హైదరాబాద్‌కు చెందిన యాక్టివిస్ యాక్ట్ విజయ్ గోపాల్ జులై 20న ఎన్‌పీపీఏకు కంప్లయిం ట్ చేశారు. అధిక ఫీజుల వసూలుకు సంబంధించిన బిల్ కాపీలను మెయిల్ ద్వారా ఎన్‌పీపీఏకు పంపించారు. పేషెంట్లకు ఇచ్చిన మెడిసిన్‌కు ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ వసూలు చేసినట్టుబిల్ కాపీల్లో స్పష్టంగా ఉంది. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్‌పీపీఏ ఆఫీసర్లు ఈ నెల 10న మూడు హాస్పిటళ్లకు నోటీసులు జారీ చేశారు. పేషెంట్లకు ఇచ్చిన మందులు, వాటి ఎమ్మార్పీ ఇతర వివరాలన్నింటి నీ 15 రోజుల్లోగా తమకు పంపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విషయంపై స్టేట్ డ్రగ్ అడ్మినిస్ర్టేషన్ కంట్రోల్ డైరెక్టర్‌కూ సమాచారం ఇచ్చారు. తాను ఇచ్చిన కంప్లయింట్, దానికి స్పందించి ఎన్‌పీపీఏ నోటీసులు జారీ చేసిన విషయాన్ని విజయ్‌గోపాల్‌మీడియాకు బుధవారం వెల్లడించారు. ఎన్‌పీపీఏ వెంటనే స్పందించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆ హాస్పిటళ్లపై తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు. మెడిసిన్స్ కు ఎమ్మార్పీ కంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై ఎన్‌పీపీఏకు కంప్లయింట్ చేయాలని ఆయన ప్రజలకు సూచించారు.