తెలంగాణలో 5 ప్రభుత్వ దవాఖాన్లకు ఎన్‌‌క్వాష్ సర్టిఫికేషన్

తెలంగాణలో  5 ప్రభుత్వ దవాఖాన్లకు ఎన్‌‌క్వాష్ సర్టిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 5 ప్రభుత్వ దవాఖాన్లకు నేషనల్‌‌ క్వాలిటీ అష్యూరెన్స్‌‌ స్టాండర్డ్స్‌‌ (ఎన్‌‌క్వాష్) సర్టిఫికేషన్‌‌ లభించింది. హుజూరాబాద్‌‌ ఏరియా దవాఖాన, ఉట్నూరు సీహెచ్‌‌సీ, జగిత్యాల పీహెచ్‌‌సీ, అడ్డగుంటపల్లి యూపీహెచ్‌‌సీ, ధంసులాపురం ఏఏఎం ఈ అవార్డుకు ఎంపికయ్యాయి. శుక్రవారం ఢిల్లీలో జరుగనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా రాష్ట్ర అధికారులు ఈ అవార్డులు అందుకోనున్నారు.