సింబల్​ లేకుండా పోటీకి అనుమతి ఇవ్వండి

సింబల్​ లేకుండా పోటీకి అనుమతి ఇవ్వండి

సీఈసీ పర్మిషన్​ కోరిన సుధీర్

సూర్యాపేట, వెలుగు: స్వతంత్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా.. ఎన్నికల్లో ఇంకా గుర్తుల మీద ఆధారపడి పోటీ చేయటం బాధాకరమని ఎన్నారై జలగం సుధీర్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్​గా పోటీ చేస్తున్న తనకు సింబల్ లేకుండా కేవలం పేరు, ఫొటోతో ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని ఈసీని కోరారు. ఈ మేరకు ఈసీఐకి మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. 1968లో వచ్చిన గుర్తుల విధానం ఇక నుంచి తీసివేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రధాన పార్టీలకు గుర్తులు ప్రచారం చేసుకోవటానికి ఎక్కువ సమయం ఉందని, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల ప్రచారానికి సమయం దొరక్కపోవటం కూడా పబ్లిక్​లో చర్చ ఉన్నదని వివరించారు. దీనిపై ఈసీ నుంచి ఇంకా స్పందన రాలేదు.