చిన్నశంకరంపేట, వెలుగు: విదేశాల్లో సాఫ్ట్ వేర్ జాబ్ వదులుకుని సొంతూరికి వచ్చి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎన్ఆర్ఐ సర్పంచ్‌గా విజయం సాధించాడు. చిన్నశంకరంపేటకు చెందిన కంజర్ల చంద్రశేఖర్ పదేండ్ల కింద సింగపూర్ వెళ్లి అక్కడ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేశాడు. అక్కడి నుంచి అమెరికా, ఆ తర్వాత కెనడాకు వెళ్లి జాబ్ చేశాడు. అతడి భార్య అక్కడే సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తోంది.
గతంలో చిన్నశంకరంపేట సర్పంచ్ గా పనిచేసిన తన తాత శంకరప్ప ఇన్పిరేషన్ తో పుట్టిన ఊరి అభివృద్ధికి పాటుపడాలని పది నెలల కిందట సొంతూరు వచ్చాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ సొంత నిధులతో గ్రామ సమస్యలను పరి ష్కరించడంతో పాటు ఆలయాల అభివృద్ధికి విరాళాలు ఇచ్చాడు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులను మెరుగు పరచేందుకు తనవంతు సాయం అందించాడు.
ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతు లేకండా ఇండిపెండెంట్‌గా సర్పంచ్ స్థానానికి పోటీ చేశాడు. మొత్తం 2,012 ఓట్లు పోల్ కాగా చంద్రశేఖర్1,271 ఓట్ల భారీ మెజార్టీతో సర్పంచ్ గా గెలపొందడం విశేషం.
