క్యాసినో పేరుతో..ఎన్ఆర్ఐ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి రూ.10 కోట్లు టోకరా

క్యాసినో పేరుతో..ఎన్ఆర్ఐ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి రూ.10 కోట్లు టోకరా

సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పెట్టుబడుల పేరుతో ఆశచూపి క్షణాల్లో కూర్చున్న చోటే కోట్లు కొల్లగొడుతున్నారు. లేటెస్ట్ గా యూఎస్ లో ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను బురిడీ కొట్టించారు హైదరాబాద్ వాసులు.    బెట్టింగ్, క్యాసినోలో పెట్టుబడుల పేరుతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి నుంచి రూ.10 కోట్లు తీసుకుని మోసం చేశారు ఐదుగురు చీటర్స్. దీంతో ఎన్ఆర్ఐ    హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేసిన NRI చేశాడు.

రెండు రోజుల క్రితం హైదరాబాద్‌‌కు చెందిన 24 ఏండ్ల యువతి ఇటీవల ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో వచ్చిన ఓ యాడ్ చూసి, బెట్టింగ్ కోసం స్కామర్లను ఆశ్రయించింది. మొదట బోనస్, గెలిచిన నగదు విత్​డ్రాకు యాక్సెస్ ఇవ్వడంతో నమ్మకం కలిగిన యువతి పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ చేసింది. నష్టపోతున్నప్పటికీ కుటుంబం అప్పులు తీర్చాలనే ఉద్దేశంతో దాదాపు రూ.30 లక్షల వరకు డబ్బులు బెట్టింగ్ పెట్టింది. ఆ తర్వాత ఆమె అకౌంట్ ఫ్రీజ్ కావడంతో రూ.30 లక్షలు పోగొట్టుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.