బీఎస్‎ఈలో లిస్టయిన ఎన్ఎస్ఈ.. రూ.4.53 లక్షల కోట్లకు మార్కెట్ క్యాప్

బీఎస్‎ఈలో లిస్టయిన ఎన్ఎస్ఈ.. రూ.4.53 లక్షల కోట్లకు మార్కెట్ క్యాప్

ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్​ఎస్​ఈ) షేర్లు గురువారం స్టాక్ మార్కెట్లలో స్వల్ప లాభాలతో అరంగేట్రం చేశాయి. ఇష్యూ ధర రూ.1,785 కాగా ఎన్ఎస్ఈ షేరు రూ.1,800 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ సమయంలో రూ.1,845 గరిష్ట స్థాయిని తాకింది. చివరికి రూ.1,818 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ మార్కెట్ విలువ రూ.4.53 లక్షల కోట్లకు చేరింది. రూ.22,569 కోట్ల విలువైన ఈ ఐపీఓ ఆరు రెట్ల సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దక్కించుకుంది.  దేశంలో రెండో అతిపెద్ద పబ్లిక్ ఆఫరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రికార్డు సృష్టించింది.  దీంతో మనదేశంలో టాప్​-–10 బీఎస్​ఈ లిస్టెడ్​ కంపెనీల జాబితాలో చేరింది.