మీర్పేట్ రహదారి పై ఉద్రిక్తత నెలకొంది. టెట్ పరీక్షను వెంటనే వాయిదా వెయ్యాలని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్ ని రంగారెడ్డి జిల్లా NSUI నాయకులు అడ్డుకున్నారు. మీర్పేట్ లో కార్యక్రమంలో మంత్రిని కలిసి వినతి పత్రాని అందించే ప్రయత్నం చేశారు NSUI నాయకులు.. అయితే వారికి అవకాశం ఇవ్వకపోవడంతో మంత్రి కాన్వాయ్ కి అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. రంగారెడ్డి జిల్లా NSUI అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డితో సహా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి మీర్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
