
- అభ్యర్థులు గుర్తింపు కార్డులు
- అప్ డేట్ చేసుకోవాలని సూచన
న్యూఢిల్లీ: జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) సెషన్ 1 వచ్చే ఏడాది జనవరిలో జరుగుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. సెషన్ 2 పరీక్షను ఏప్రిల్ లో నిర్వహిస్తామని వెల్లడించింది. సెషన్ 1 పరీక్ష అప్లికేషన్ ఫామ్స్ వచ్చే నెలలో ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
‘‘అర్హులైన అభ్యర్థులు తమ ఆధార్ కార్డు, కేటగిరి సర్టిఫికెట్లను ముందే అప్ డేట్ చేసుకోవాలి. అభ్యర్థి సరైన పేరు, డేటాఫ్ బర్త్, తండ్రి పేరు, అడ్రస్ వంటి వివరాలను కరెక్టుగా అప్ డేట్ చేసుకోవాలి. వికలాంగులు కూడా తమ డిసెబిలిటీ వివరాలను అప్ డేట్ చేసుకోవాలి” అని ఎన్టీఏ సూచించింది. పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు ఎన్టీఏ వెబ్ సైట్ ను రెగ్యులర్ గా చూడాలని తెలిపింది.