రూ.29 వేల కోట్ల పెట్టుబడికి ఎన్టీపీసీ బోర్డు ఆమోదం

 రూ.29 వేల కోట్ల పెట్టుబడికి ఎన్టీపీసీ బోర్డు ఆమోదం
  • రామగుండం సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ రెండో దశలో ఇన్వెస్ట్​మెంట్
  • పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: రామగుండంలో చేపట్టనున్న తెలంగాణ సూపర్‌‌‌‌‌‌‌‌ థర్మల్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ రెండో దశకు (3,800 మెగావాట్లు) ఎన్టీపీసీ బోర్డు రూ.29,344 కోట్ల పెట్టుబడికి ఆమోదం తెలిపిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌‌‌‌‌‌‌‌సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గురువారం అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యుత్‌‌‌‌‌‌‌‌ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్‌‌‌‌‌‌‌‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

 మెయిన్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ ప్యాకేజీ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన నాటి నుంచి 64 నెలల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం, కమిషనింగ్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేస్తామని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అయితే, విద్యుత్‌‌‌‌‌‌‌‌ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడంపైనే తదుపరి చర్యలు ఆధారపడి ఉంటాయని, దీనికోసం తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.