V6 News

వకీల్‌‌‌‌పల్లి గనిని సందర్శించిన ఎన్‌‌‌‌టీపీసీ ఈడీ

వకీల్‌‌‌‌పల్లి గనిని సందర్శించిన ఎన్‌‌‌‌టీపీసీ ఈడీ

గోదావరిఖని, వెలుగు: సింగరేణి ఆర్‌‌‌‌‌‌‌‌జీటూ ఏరియా వకీల్‌‌‌‌పల్లి గనిలోని కంటిన్యూయస్ మైనర్ సెక్షన్‎ను ఎన్‌‌‌‌టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సమంతా శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా అండర్​గ్రౌండ్‌‌‌‌లో జరుగుతున్న మెషనరీ పనులను, బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతను పరిశీలించి, తీసుకుంటున్న రక్షణ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

 ఆయన వెంట ఎన్టీపీసీ ఏజీఎం హేమంత్ షిండే, డీజీఎం అతుల్ కుమార్ గైక్వాడ్, ఆర్‌‌‌‌‌‌‌‌జీ 3 ఏరియా జీఎం మధుసూదన్, వకీల్‌‌‌‌పల్లి ఏజెంట్ నెహ్రూ, గని మేనేజర్ రవికిరణ్, క్వాలిటీ డీజీఎం బీవీ సత్యనారాయణ, సేప్టీ ఆఫీసర్ రాంకుమార్, తదితరులున్నారు.