బాండ్ల ఇష్యూతో రూ.12 వేల కోట్లు సేకరించనున్న ఎన్‌‌‌‌టీపీసీ

బాండ్ల ఇష్యూతో రూ.12 వేల కోట్లు సేకరించనున్న ఎన్‌‌‌‌టీపీసీ

న్యూఢిల్లీ: ఎన్‌‌‌‌టీపీసీ రూ.12 వేల కోట్లను  నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్‌‌‌‌ (ఎన్‌‌‌‌సీడీలు) ఇష్యూ చేయడం ద్వారా సేకరించాలని నిర్ణయించింది. ప్రైవేట్ ప్లేస్‌‌‌‌మెంట్‌‌‌‌ ద్వారా రానున్న  12 నెలల్లో ఒకటి లేదా అంత కంటే ఎక్కువ విడతల్లో ఈ ఫండ్స్‌‌‌‌ను సేకరించాలని చూస్తోంది.  ‘రూ. 12 వేల కోట్ల వరకు ఫండ్స్‌‌‌‌ను డొమెస్టిక్ మార్కెట్‌‌‌‌లో ఎన్‌‌‌‌సీడీల (బాండ్ల) ను ఇష్యూ చేయడం ద్వారా సేకరించాలని శనివారం జరిగిన మిటింగ్‌‌‌‌లో కంపెనీ బోర్డ్‌‌‌‌ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు’ అని ఎన్‌‌‌‌టీపీ ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది.  

స్పెషల్ రిజల్యూషన్ ఇచ్చినప్పటి నుంచి ఏడాదిలోపు అంటే వచ్చే ఏడాది జరగనున్న యాన్యువల్ జనరల్ మీటింగ్‌‌‌‌లోపు  ఈ ఫండ్స్‌‌‌‌ సేకరణ ఉంటుందని తెలిపింది.  ఎన్‌‌‌‌టీపీసీ నికర లాభం ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ.4,871 కోట్లుగా రికార్డయ్యింది.