V6 News

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో భారీ పౌరాణిక చిత్రం.. తారక్ పుట్టినరోజున అనౌన్స్‌మెంట్?

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో భారీ పౌరాణిక చిత్రం.. తారక్ పుట్టినరోజున అనౌన్స్‌మెంట్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేరీర్ ఇప్పుడు పీక్ స్టేజీలో ఉంది. 'ఆర్ఆర్ఆర్','దేవర'తో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన తారక్, తన తదుపరి చిత్రాలతో భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ తర్వాతి ప్రాజెక్టులపై వస్తున్న అప్‌డేట్స్ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తున్నాయి.

త్రివిక్రమ్ - తారక్ కాంబోలో..

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'అరవింద సమేత' ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ ఒక భారీ పౌరాణిక చిత్రం కోసం చేతులు కలపబోతున్నారనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. ఈ చిత్రానికి 'షణ్ముఖుడు' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుపై గతంలోనే హింట్స్ వచ్చాయి. 

'షణ్ముఖుడు'గా..

2025లో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఎన్టీఆర్ కనిపించినప్పుడు, ఆయన చేతిలో ఆనంద్ బాలసుబ్రహ్మణ్యం రచించిన 'మురుగ - ది లార్డ్ ఆఫ్ వార్' పుస్తకం ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. కుమారస్వామి (కార్తికేయ) జీవిత చరిత్ర ఆధారంగా త్రివిక్రమ్ ఈ కథను సిద్ధం చేస్తున్నారని, ఇందుకోసం తారక్ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టారని వినికిడి. మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది..

'డ్రాగన్'లోకి షాహిద్ కపూర్ ఎంట్రీ?

మరోవైపు, 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ చేస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'డ్రాగన్'  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ పాత్ర కోసం మలయాళ నటుడు టోవినో థామస్‌ను అనుకున్నారు, కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు ఆ స్థానంలో షాహిద్ కపూర్‌ను తీసుకురావడానికి మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

 ఒకవేళ ఇది నిజమైతే, షాహిద్ కపూర్ సౌత్ ఇండియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయం. తారక్ - షాహిద్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ వెండితెరపై విజువల్ ఫీస్ట్‌లా ఉంటాయని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.   ప్రస్తుతం ఇండియన్ సినిమా టాప్ రెమ్యునరేషన్ తీసుకునే నటులలో ఒకరు. ఒక వైపు ప్రశాంత్ నీల్ యాక్షన్ డ్రామాతో, మరోవైపు త్రివిక్రమ్ పౌరాణిక గాథతో బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం సినీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.