ఎన్టీఆర్ దేవర నుంచి స్పెషల్ వీడియో.. ఫ్యాన్స్కు పూనకాలు కన్ఫర్మ్

ఎన్టీఆర్  దేవర  నుంచి స్పెషల్ వీడియో.. ఫ్యాన్స్కు పూనకాలు కన్ఫర్మ్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- స్టార్ డైరెక్టర్ కొరటాల శివ( Koratala Shiva)  కాంబినేషన్‌లో  దేవర మూవీ వస్తోన్నవిషయం తెలిసిందే.  ఈ మూవీ పై  టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత మూవీ కావడంతో భారీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం  దేవర మూవీ మరో  250 రోజుల్లో రిలీజ్ కానుందని తెలియజేస్తూ..మేకర్స్ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేశారు.

ఈ వీడియోలో డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ.. ఈ కథలో మనుషుల కంటే ఎక్కువ మృగాలు ఉంటారు. భయమంటే ఏంటో తెలియని మృగాలు..దేవుడు అంటే భయం లేదు..చావు అంటే భయం లేదు.. కానీ ఒకే ఒక్కటి అంటే భయం ఉంటుంది వాళ్లకి.. ఆ భయమేంటో తెలియాలంటే దేవర వచ్చే వరకు మీ హార్ట్స్ ను హోల్డ్ చేసి పెట్టి ఉంచండి..అంటూ .. భయం ఉండాలి..భయం అవసరం.. 'అని కొరటాల చెప్తూ మూవీపై అంచనాలను భారీగా పెంచేశారు. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు మరోసారి పూనకాలు కన్ఫర్మ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 

ఈ వీడియోలో సముద్రంలో కత్తి పట్టుకున్న ఉన్న ఎన్టీఆర్ స్టిల్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ఒక  సముద్ర వీరుడిగా తలలు నరకడానికి..సమస్త యుద్దాన్ని చేయటానికి.. కదిలొస్తున్న ఎన్టీఆర్ వీడియో షేర్ చేశారు మేకర్స్. లేటెస్ట్ గా సైఫ్ ఆలీఖాన్, ఎన్టీఆర్ మధ్య భారీ యాక్షన్ ఎపిసోడ్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.. దీంతో ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరో 250 రోజుల్లో రానున్న దేవర మూవీ టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం అని టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎన్టీఆర్ ఓ వర్గాన్ని కాపాడే నాయకుడిగా నటిస్తున్నట్లు మూవీ ఓపెనింగ్ అప్పుడే చెప్పారు కొరటాల. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా APR 5న 2024 లో రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు.