స్క్రీన్ ఏదైనా..సెన్సేషనే.!

స్క్రీన్ ఏదైనా..సెన్సేషనే.!

వెండితెరపై సక్సెస్ అయినవాళ్లంతా బుల్లితెరపై మెప్పించలేరు. అలాగే స్మాల్‌‌ స్క్రీన్‌‌పై సెన్సేషన్ క్రియేట్ చేసినవాళ్లు బిగ్‌‌ స్క్రీన్‌‌పై మ్యాజిక్ చేయలేరు. కానీ తాను కనిపించే స్క్రీన్ ఏదైనా సెన్సేషన్ ఒకటే అంటున్నాడు ఎన్టీఆర్. టాలీవుడ్ టాప్‌‌ హీరోల్లో ఒకడిగా వెలుగుతున్న తారక్.. ‘బిగ్‌‌బాస్‌‌’ షో ఫస్ట్‌‌ సీజన్‌‌తో హోస్ట్‌‌గా మెప్పించాడు. కాస్త గ్యాప్‌‌ తర్వాత ‘మీలో ఎవరు కోటీ శ్వరులు’ షోతో బుల్లితెరపై మళ్లీ అడుగుపెట్టాడు. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్‌‌ హయ్యెస్ట్ టీఆర్పీ సాధించింది. గత సీజన్‌‌లో లాంచింగ్ ఎపిసోడ్‌‌కి 9.7 రేటింగ్ వస్తే, తారక్ హోస్ట్ చేస్తున్న సీజన్‌‌కి 11.4 రేటింగ్ వచ్చింది. తనకున్న ఫాలోయింగ్, క్రేజ్‌‌తో పాటు హోస్ట్ చేస్తున్న విధానమే ఈ సక్సెస్‌‌కి కారణమంటున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే ‘ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్’ షూట్‌‌ని ఆల్రెడీ కంప్లీట్ చేశాడు తారక్. త్వరలో కొరటాల మూవీలో జాయిన్ కానున్నాడు. ఇందులో స్టూడెంట్ లీడర్‌‌‌‌ పాత్ర చేయ బోతున్నాడు. దానికోసం మరో కొత్త లుక్‌‌లోకి మారిపోతు న్నాడట. ఈ లుక్‌‌ కూడా కొరటాల, ఎన్టీఆర్‌‌‌‌ల గత చిత్రం ‘జనతా గ్యారేజ్‌‌’ టైప్‌‌లోనే కూల్‌‌గా ఉంటుందని తెలుస్తోంది. దాంతో ఇది ‘జనతా గ్యారేజ్‌‌’కి సీక్వెల్ అనే ప్రచారానికి బలం చేకూరుతోంది. ఆల్రెడీ టీవీ షో కోసం ఓ డిఫరెంట్‌‌ లుక్‌‌ మెయింటెయిన్ చేస్తున్న తారక్.. కొత్త సినిమా కోసం ఎలా మేకోవర్‌‌‌‌ అవుతాడో చూడాలి. హీరోయిన్‌‌ ఇంకా కన్‌‌ఫర్మ్ కాలేదు. మ్యూజిక్ డైరెక్టర్‌‌‌‌గా అనిరుధ్ రవిచందర్‌‌‌‌ని తీసుకున్నా రట. త్వరలో మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్టవుతాయని సమాచారం.