NTR: 'దండోరా'పై ఎన్టీఆర్ ప్రశంసల జల్లు.. నెట్టింట వైరల్ అవుతున్న తారక్ ట్వీట్!

NTR: 'దండోరా'పై ఎన్టీఆర్ ప్రశంసల జల్లు.. నెట్టింట వైరల్ అవుతున్న తారక్ ట్వీట్!

'దండోరా' మూవీపై టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'ఇప్పుడే దండోరా సినిమా చూశా.. దర్శకుడు మురళీకాంత్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించాడు. గాఢమైన భావోద్వేగాలతో చాలా ఆలోచింపజేసే విధంగా ఉందని కొనియాడారు. శివాజీ, నవదీష్, నందు, రవికృష్ణ, బిందు సూధవి అద్భుతంగా నటించారని ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

.ఈ ప్రయత్నానికి మద్దతు ఇచ్చినందుకు రవీంద్ర బెనర్జీకి, డైరెక్టర్ మురళి కాంత్ కు నా ప్రత్యేక అభినందనలు . ఈ మూవీలో భా గమైనందుకు తారాగణం, సిబ్బందికి కంగ్రాట్స్ అంటూ తారక్ ట్వీట్ చేశాడు. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో.. హీరో నవదీప్ రిప్లై ఇచ్చాడు. థ్యాంక్ యూ అన్న య్య అంటూ పోస్ట్ చేశాడు.  ఇక గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'దండోరా'..  ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read :  'జై హో' సాంగ్ రెహమాన్ కంపోజ్ చేసింది కాదా?

 

 కాగా... ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,  సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి  'డ్రాగన్' సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారని అధికారికంగా ప్రకటించారు.  ఎన్టీఆర్, నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ  మూవీపై సినీ వర్గాలతో పాటు , అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.