ముషీరాబాద్, వెలుగు: ఓ ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఆ వాహనం దగ్ధమైంది. ఆదివారం ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేసిన ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు వచ్చి వాహనమంతా అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. కారులో ఎవరు లేకపోవడంతో ప్రాణానష్టం జరుగలేదు.
