
జూ.ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో వరల్డ్‌వైడ్‌గా ఫేమ్ తెచ్చుకున్నాడు. అయితే ఆ సినిమా రిలీజై ఏడాది అవుతున్నా.. తారక్ నెక్స్ట్ మూవీ స్టార్ట్ కాలేదు. కొరటాల శివ దర్శకత్వంలో అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటికీ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్‌కి వెళ్లలేదు. ఇటీవల ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో మొదలుపెట్టనున్నట్టు టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా కథ సముద్రపు మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. దీనికోసం హైదరాబాద్‌లో భారీ సముద్రం సెట్స్‌ని డిజైన్ చేసే పనిలో ఉన్నారు ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్. ప్రస్తుతం సాబు టీమ్ పోర్ట్ ఎన్విరాన్‌మెంట్‌ని క్రియేట్ చేసే పనిలో ఉంది.
తాజాగా సాబు సిరిల్.. బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని సెట్స్ వేస్తున్న లొకేషన్స్‌లో తన టెక్నికల్ క్రూతో కలిపి జరుపుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఫిబ్రవరి సెకెండ్ వీక్‌లో జరగనున్న ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్‌లో రామ్ చరణ్‌తో పాటు రాజమౌళి ఫ్యామిలీ, ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ మొత్తం హాజరు కాబోతున్నారట. కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ, అనిరుథ్ సంగీతం అందిస్తున్నారు. ఇది ఎన్టీఆర్‌కి 30వ సినిమా. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు కూడా ప్రారంభోత్సవం రోజున తెలియజేసే చాన్స్ ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబోలో రాబోతున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి.