న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్ఎఫ్సీ) సైంటిఫిక్ ఆఫీసర్, నర్స్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 28.
విభాగాల వారీగా ఖాళీలు: సైంటిఫిక్ ఆఫీసర్ (సి) జనరల్ మెడికల్ డ్యూటీ ఆఫీసర్ 05, నర్స్ (ఏ) 16, సైంటిఫిక్ అసిస్టెంట్ (బి)– రేడియోగ్రాఫర్ 01, సైంటిఫిక్ అసిస్టెంట్ (బి)– పాథాలజీ టెక్నీషియన్ 01, ఫార్మాసిస్ట్ (బి) 03, టెక్నీషియన్ (బి) ఎక్స్–రే టెక్నీషియన్ 2.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి12వ తరగతి + నర్సింగ్ & మిడ్‌వైఫరీలో డిప్లొమా లేదా బీఎస్సీ (నర్సింగ్), బీఎస్సీ (రేడియోగ్రఫీ), బీఎస్సీతోపాటు డీఎంఎల్టీలో పీజీ డిప్లొమా హెచ్‌ఎస్‌సీ (10+2) + ఫార్మసీలో రెండేండ్ల డిప్లొమా, హెచ్‌ఎస్‌సీ (సైన్స్)తోపాటు ఏడాది మెడికల్ రేడియోగ్రఫీ / ఎక్స్-రే టెక్నిక్ ట్రేడ్ సర్టిఫికెట్, ఎంబీబీఎస్ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: సైంటిఫిక్ ఆఫీసర్ (డి) పోస్టులకు రూ.550. నర్స్ (ఏ), సైంటిఫిక్ అసిస్టెంట్ (బి) పోస్టులకు రూ.150, ఫార్మాసిస్ట్ (బి), టెక్నీషియర్ (బి) పోస్టులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
లాస్ట్ డేట్: మే 2.
సెలెక్షన్ ప్రాసెస్: స్క్రీనింగ్ టెస్ట్/ రాత పరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.nfc.gov.inను సందర్శించండి.

