సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డికి నూకల నరోత్తమ్‌‌రెడ్డి అవార్డు

 సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డికి నూకల నరోత్తమ్‌‌రెడ్డి అవార్డు

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీకి చెందిన క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ ప్రదానం చేసే జాతీయ స్థాయి అవార్డులకు రాష్ట్రం నుంచి నలుగురు ఎంపికయ్యారు. రిటైర్డ్‌‌ డీఎఫ్‌‌వో డాక్టర్ తులసీరావుకు పర్యావరణ జాతీయ అవార్డు, సీనియర్ జర్నలిస్ట్‌‌ దిలీప్‌‌రెడ్డికి నూకల నరోత్తమ్‌‌రెడ్డి జాతీయ అవార్డు, పర్యావరణ వేత్త దొంతి నర్సింహారెడ్డికి శివాజీరావు జాతీయ అవార్డు, ఆయుర్వేద డాక్టర్ అల్లాని కిషన్‌‌రావుకు ఎర్త్‌‌కేర్ ఎన్విరాన్‌‌మెంట్ జాతీయ అవార్డు ఇవ్వనున్నట్టు సొసైటీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 6న నల్సార్ యూనివర్సిటీలో జరగనున్న కార్యక్రమంలో, సీఎం రేవంత్‌‌రెడ్డి వీరికి అవార్డులు అందజేస్తారని వెల్లడించింది.