
- మళ్లీ స్టార్ట్ అవుతుందో లేదోననే ఆందోళనలో వ్యాపారులు
హైదరాబాద్, వెలుగు: పదహారు వందల స్టాళ్లు.. లక్షల పెట్టుబడుల పెట్టుబడితో నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో మొదలైన నుమాయిష్రెండ్రోజులకే క్లోజ్అయ్యింది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఎగ్జిబిషన్‌ను తాత్కాలికంగా బంద్‌చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాత్రి జీఓ రిలీజ్చేసింది. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి స్టాళ్లు ఏర్పాటు చేసిన వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అన్ని శాఖల పర్మిషన్లు తీసుకుని, హైకోర్టు గైడ్‌లైన్స్, కొవిడ్రూల్స్పాటిస్తూ నిర్వాహకులు ఎగ్జిబిషన్స్టార్ట్చేశారు.
45 రోజుల పాటు నిర్వహించేలా దేశవ్యాప్తంగా వచ్చిన వేలమంది వ్యాపారులకు స్టాళ్లు కేటాయించారు. అంతా సవ్యంగా జరుగుతోంది.. విజిటర్స్పెరుగుతున్నారు అనుకున్న టైంలో ఆపేయాలని ఆదేశాలు రావడంతో వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. లక్షలు ఖర్చుచేసి స్టాల్ రెంటు, కరెంట్ బిల్లులు కట్టామని, అప్పులు తెచ్చి సరుకు కొన్నామని ఆవేదన చెందుతున్నారు. తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జీఓ వచ్చినప్పటికీ తిరిగి స్టార్ట్అవుతుందో లేదోనని డైలమాలో పడ్డారు. జనవరి 10 నుంచి తిరిగి స్టార్ట్అవుతుందని చర్చించుకుంటున్నప్పటికీ సొసైటీ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని అంటున్నారు.
స్టాల్ ప్లేసును బట్టి రెంట్
నుమాయిష్‌లో ఒక స్టాల్ పెట్టుకోవాలంటే స్పేస్‌ని బట్టి సొసైటీకి రెంటు కట్టాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ లోని స్టాల్ కు రూ.8లక్షలు, లోపలైతే రూ.4లక్షలు, కార్నర్లలో లక్ష రూపాయలు జీఎస్‌టీతో కలిపి కట్టాలి. కరెంట్ బిల్ లక్షా 75 వేలు, ఒక్కో ఐడీ కార్డుకు రూ.400 పే చేయాలి. ఇలా వర్కర్ల జీతం, ఇతర ఖర్చులు కలిపి ఒక్కో రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు అయ్యిందని వ్యాపారులు అంటున్నారు. లక్షల పెట్టుబడితో వేల కిలో మీటర్ల నుంచి వచ్చామని, ఎగ్జిబిషన్ఆగిపోవడంతో ఎంతో నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. సొసైటీ సెక్రెటరీని కలిసేందుకు ప్రయత్నిస్తే.. ఎలాంటి స్పందన లేదని చెబుతున్నారు.
కశ్మీర్ నుంచి వచ్చాం
నుమాయిష్‌లో స్టాల్ పెట్టేందుకు కశ్మీర్ నుంచి వచ్చాం. కశ్మీర్ లెదర్, శాల్స్, డ్రెస్సెస్, జువెలరీ, డ్రై ఫ్రూట్స్ తెచ్చాం. 30 ఏండ్ల నుంచి ఇక్కడికి వస్తున్నాం. ఎగ్జిబిషన్‌కు పర్మిషన్ఇచ్చారని తెలుసుకున్నాకే వచ్చాం. కానీ స్టార్ట్‌చేసిన 2 రోజులకే బంద్చేయమన్నారు. ప్రభుత్వం చెప్పినట్లు వారం రోజుల వేచి చూస్తాం. రీ ఓపెన్ కాకపోతే చాలా లాస్ ఉంటుంది. 25 లక్షలు పెట్టుబడి సామన్లు కొన్నా. బంద్ఎప్పటివరకూ అనేది సొసైటీ సభ్యులు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలేదు. వచ్చిన ప్రతి ఒక్కరినీ అడుగుతున్నాం. కానీ అం దరూ వారం రోజులు ఆగాలి అంటున్నారు. - షబ్బీర్ , కశ్మీర్ స్టాల్ నిర్వాహకుడు
ఏం చెప్తలేరు..
యూపీ నుంచి వచ్చినం. ఎగ్జిబిషన్ కోసమే 4 నెలలుగా పింగాణి పాత్రలు తయారు చేశాం. రూ.5లక్షల మాల్ తీసుకొచ్చినం. రెండో రోజే క్లోజ్ అన్నారు. సొసైటీ వాళ్లు ఏం చెప్తలేరు. - షాహిద్, ఉత్తరప్రదేశ్ వ్యాపారి